News July 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 7, 2024

జులై 7: చరిత్రలో ఈరోజు

image

1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
* ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

News July 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 07, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:26 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:47 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 7, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 07, ఆదివారం
విదియ: తెల్లవారుజామున 04:25 గంటలకు
పుష్యమి: పూర్తిగా
వర్జ్యం: మధ్యాహ్నం 1.29-3.09 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4:50 -5:42 గంటల వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30- 6.00 గంటల వరకు

News July 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 7, 2024

TODAY HEADLINES

image

* AP, TG సీఎంల భేటీ.. విభజన సమస్యలపై చర్చ!
* రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు: జగన్
* TGలో ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్
* తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
* ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
* రూ.800 కోట్లు దాటిన ‘కల్కి 2898AD’ కలెక్షన్స్
* తొలి టీ20లో భారత్‌పై జింబాబ్వే విజయం
* ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్

News July 6, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డి అనే ముగ్గురిని మంగళగిరి పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ 19న ఈ ఘటన జరగగా, ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరింది. ఇటీవల 4 పోలీస్ బృందాలు విచారణ జరిపి నిందితులను గుర్తించాయి. వారిలో గుంటూరుకు చెందిన YCP కార్యకర్తలే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించాయి. కాగా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

News July 6, 2024

సికిందర్ రజా అరుదైన రికార్డు

image

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఆయన 15 POTMలు అందుకున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (15) రికార్డును ఆయన సమం చేశారు. కాగా అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (16) ఉన్నారు.

News July 6, 2024

రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

image

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

News July 6, 2024

చంద్రబాబు రాక.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు!

image

చంద్రబాబు రాకతో తెలంగాణలో సెంటిమెంట్ రాజుకుంటోంది. ఇకపై తెలంగాణలో చంద్రబాబు పెత్తనం నడవబోతుందని, కేసీఆర్ ఉంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేవారని BRS అభిమానులు పోస్టులు చేస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్న జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని కాంగ్రెస్, టీడీపీ వాదిస్తున్నాయి. మరోసారి సెంటిమెంట్‌తో లబ్ధి పొందేందుకు BRS ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి. దీనిపై మీ కామెంట్?