News July 6, 2024

PHOTO GALLERY: చంద్రబాబు, రేవంత్ భేటీ

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ ‘ప్రజాభవన్’లో వీరి భేటీ కొనసాగుతోంది. ఏపీ తరఫున చంద్రబాబు, మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. సమావేశం ఫొటోలను పై గ్యాలరీలో చూడొచ్చు.

News July 6, 2024

పేటీఎంను $100 బిలియన్ కంపెనీగా చేయడమే నా కల: విజయ్‌శేఖర్ శర్మ

image

పేటీఎం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థ విలువను $100 బిలియన్లకు పెంచడమే తన కల అని పేర్కొన్నారు. ఇకపై లోన్స్ మంజూరు చేయడంపైనా దృష్టిసారిస్తామన్నారు. ఈ సందర్భంగా తనకు వ్యాపారంలో సహకరించిన ఇండియన్ బ్యాంకర్లకు ధన్యవాదాలు తెలిపారు. పేటీఎం మార్కెట్ విలువ $3.5 బిలియన్లకు క్షీణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించకుంది.

News July 6, 2024

భారతీయుడు-2కి రెహమాన్‌ను అందుకే తీసుకోలేదు: శంకర్

image

ఏఆర్.రెహమాన్ బిజీగా ఉండటం వల్లే ఆయనను భారతీయుడు-2కి మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోలేదని డైరెక్టర్ శంకర్ స్పష్టం చేశారు. ‘భారతీయుడు-2 పనులు ప్రారంభించినప్పుడు రెహమాన్ రోబో 2.0 BGMపై వర్క్ చేస్తున్నారు. పాటలు త్వరగా కావాల్సి ఉండడంతో ఒత్తిడి చేయడం ఇష్టం లేక అనిరుధ్‌ను సంప్రదించాను. నాకు అతని మ్యూజిక్ ఇష్టం. అతను చాలా పాపులర్ కూడా. అందుకే తీసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News July 6, 2024

కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న టీ20లో భారత్‌కు షాక్ తగిలింది. 5 ఓవర్లలో 22 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో ఓపెనర్ అభిషేక్ డకౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన రుతురాజ్ 7, రియాన్ 2 పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హిట్టర్ రింకూ సింగ్ కూడా 2 బంతులాడి డకౌట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో గిల్, జురెల్ ఉన్నారు.

News July 6, 2024

జగన్.. నీ చెల్లి పంపిన అద్దంలో ఓ సారి ముఖం చూసుకో: TDP

image

YCPకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్న జగన్ <<13576740>>ఆరోపణలపై<<>> TDP మండిపడింది. ‘జగన్ మాటలకు బాబాయ్ వివేకానంద రెడ్డి ఉలిక్కిపడ్డాడు. గొడ్డలి వేట్ల గాయాలు ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఒరిజినల్ YSR అభిమానులు, జగన్ నకిలీ ఫ్యాన్స్.. వారిలో వారే కొట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. TDPని హెచ్చరించే ముందు ఓ సారి నీ చెల్లి పంపించిన అద్దంలో ముఖం చూసుకో జగన్’ అని ట్వీట్ చేసింది.

News July 6, 2024

BREAKING: ఏడాదికి 2 సార్లు టెట్

image

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాసుకోవచ్చని జీవోలో పేర్కొంది. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది.

News July 6, 2024

ఇండియన్ ఫ్యాన్స్‌ను చూసి ఆశ్చర్యపోయిన క్రిస్ లిన్

image

టీమ్ ఇండియా బస్ పరేడ్‌కు హాజరైన అభిమానులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానుల క్రేజ్ చూసి తనకు పిచ్చెక్కిందన్నట్లుగా ఎమోజీలతో లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా క్రిస్ లిన్ ఐపీఎల్‌లో DC, SRH, MI, KKRకు ప్రాతినిధ్యం వహించారు. 42 మ్యాచులాడి 1329 పరుగులు చేశారు. ఆసీస్ తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడారు.

News July 6, 2024

అభిషేక్ శర్మ డకౌట్

image

IPLలో దుమ్మురేపి జాతీయ జట్టుకు ఎంపికైన అభిషేక్ శర్మ అరంగేట్ర మ్యాచులో నిరాశపరిచారు. జింబాబ్వేతో తొలి ఓవర్లో ఎదుర్కొన్న నాలుగో బంతికే డకౌట్ అయ్యారు. బెన్నెట్ బౌలింగ్‌లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఫస్ట్ ఓవర్ మెయిడిన్ అయింది. భారత్ టార్గెట్ 116 రన్స్.

News July 6, 2024

పాప్ సింగర్ కోసం సిటీ పేరే మార్చేశారు!

image

ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై జర్మనీలోని ఓ నగరం వినూత్నంగా అభిమానాన్ని చాటుకుంది. ఈనెల 17-19 మధ్య స్విఫ్ట్ గెల్సెన్‌కెర్హన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ఆ నగరం పేరును ‘స్విఫ్ట్‌కెర్హన్’గా మార్చారు. ఓ అభిమాని విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ప్రదేశాలు, ట్రామ్స్‌కు కూడా స్విఫ్ట్ పేరు పెడతామని తెలిపారు. ఆ నగరంలో స్విఫ్ట్ మూడు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

News July 6, 2024

ఒక్కసారైనా WC గెలిచావా?.. వాన్‌కు రవిశాస్త్రి కౌంటర్

image

T20 WC నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు రవిశాస్త్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘వాన్ ఇష్టమొచ్చింది మాట్లాడొచ్చు. కానీ ఆయన మాటలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లండ్ ఎందుకు విఫలమైందో ముందుగా దానిపై దృష్టి పెడితే బెటర్. వాన్ తన కెరీర్‌లో ఒక్క సారి కూడా ప్రపంచకప్ సాధించలేకపోయారు. అలాంటి వ్యక్తి భారత్‌ను తప్పుబట్టడం ఏంటి?’ అని రవి వ్యాఖ్యానించారు.