News July 6, 2024

పాతబస్తీలో అమిత్ షాపై కేసు ఎందుకు నమోదైంది?

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 1న HYD BJP ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున కేంద్రమంత్రి అమిత్ షా పాతబస్తీలో ప్రచారం చేశారు. ఆ సమయంలో ఇద్దరు బాలికలు చేతిలో BJP జెండాలతో ఆయన వద్దకు వచ్చారు. దీంతో ప్రచారంలో పిల్లల్ని ప్రోత్సహించి, కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని తాజాగా మొఘల్‌పురా పోలీసులు కేసును ఉపసంహరించుకున్నారు.

News July 6, 2024

ఇకపై ఈవీ ఛార్జ్‌కు 5 నిమిషాలే!

image

గంటల పాటు వేచి చూడనవసరం లేకుండా 5 నిమిషాల్లోనే ఈవీ బ్యాటరీ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. నైబోల్ట్ అనే యూకే సంస్థ 4.5 నిమిషాల్లో 70% ఛార్జ్ అయ్యే కారును రూపొందించింది. దీని కోసం ప్రత్యేకంగా 35కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీని డిజైన్ చేసింది. మరోవైపు న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ కొన్ని నెలల క్రితం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీని డిజైన్ చేసింది.

News July 6, 2024

ఇటీవలే పెళ్లి.. ప్రెగ్నెన్సీ వార్తలపై సోనాక్షి ఏమన్నారంటే?

image

గతనెల 23న హీరోయిన్ సోనాక్షి సిన్హాకు వివాహమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె ఆసుపత్రికి వెళ్లడంతో ప్రెగ్నెంట్ అంటూ కొందరు ప్రచారం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన ఆమె ‘ఇకపై మేం ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదు. వెళ్తే చాలు ప్రెగ్నెంట్ అంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆయనను చూసేందుకే ఆమె హాస్పిటల్‌కు వెళ్లారు.

News July 6, 2024

రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గమా?: పేర్ని నాని

image

AP: న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు.. రేవంత్, చంద్రబాబు డిమాండ్లు చూస్తుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎంల తీరు చూస్తుంటే విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కాగా మరికాసేపట్లో రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు.

News July 6, 2024

చంద్రబాబు వల్ల ఏపీకి రూ.లక్షన్నర కోట్లకు పైగా నష్టం: YCP

image

AP: చంద్రబాబు 2015లో ఓటుకు నోటు కేసుతో దొరికిపోవడం వల్ల ఏపీ రూ.లక్షన్నర కోట్లకు పైగా నష్టపోయిందని YCP ఆరోపించింది. ‘ఈ కేసు వల్ల HYD నుంచి చంద్రబాబు పారిపోయి రావాల్సి వచ్చింది. ఏపీకి రావాల్సిన షెడ్యూల్‌ 9, 10 సంస్థల విషయం తేలకుండానే వచ్చేశారు. దీంతో షెడ్యూల్‌ 9, 10కి సంబంధించిన సంస్థల ఆస్తులు, విభజన చట్టంలో లేని ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది’ అని ట్వీట్ చేసింది.

News July 6, 2024

తొలి క్రికెటర్‌గా నిలిచిన రియాన్ పరాగ్

image

నార్త్‌ఈస్ట్ రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్‌గా రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించారు. అస్సాంకు చెందిన ఈ 22 ఏళ్ల ఆటగాడు తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. అస్సాం తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన రియాన్.. IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడారు.

News July 6, 2024

కాసేపట్లో సీఎంల భేటీ

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సా.6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. ఏపీ తరఫున చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున రేవంత్, భట్టి విక్రమార్క పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు CSలు, ఉన్నతాధికారులు విభజన అంశాలపై చర్చించనున్నారు.

News July 6, 2024

భారత్‌లోనే అతి తక్కువ టారిఫ్ ధరలు: కేంద్రం

image

దేశంలో జియో, ఎయిర్‌టెల్, VI కంపెనీలు మొబైల్ <<13524115>>టారిఫ్‌ల<<>>ను ఒక్కసారిగా పెంచినా కేంద్రం నియంత్రణ, పర్యవేక్షణ కొరవడిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈక్రమంలో దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ మినిస్ట్రీ వివరణ ఇచ్చింది. వివిధ దేశాల టారిఫ్ ధరలను పోల్చుతూ ఇండియాలోనే చాలా తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇండియాలో సగటున $1.89 టారిఫ్‌తో నెలపాటు అపరిమిత కాల్స్, 18GB డేటా వస్తుందని తెలిపింది.

News July 6, 2024

రాజ్‌తరుణ్‌తో అఫైర్ ఆరోపణలపై స్పందించిన హీరోయిన్

image

హీరో రాజ్‌తరుణ్‌తో తనకు అఫైర్ ఉందంటూ లావణ్య అనే యువతి చేసిన <<13569817>>ఆరోపణలపై<<>> హీరోయిన్ మాల్వి మల్హోత్ర స్పందించారు. ‘నేను రాజ్‌ తరుణ్‌తో కలిసి నటించా అంతే. అతడి గురించి నాకేమీ తెలీదు. లావణ్య అలా ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదు. ఆమెను మా ఫ్యామిలీలో ఎవరూ బెదిరించలేదు. పైగా ఆమెనే మమ్మల్ని బెదిరిస్తోంది. లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని మాల్వి పేర్కొన్నారు.

News July 6, 2024

మంత్రిని కలిసిన ఆరుగురు BRS ఎమ్మెల్యేలు

image

TG: హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), కేపీ వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజ్‌గిరి) కలిసినవారిలో ఉన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి వీరు మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.