News July 5, 2024

సీఎంల భేటీ.. నీటి పంపిణీపై నో డిస్కషన్?

image

AP CM చంద్రబాబు, TG CM రేవంత్ రేపటి భేటీకి 10 అంశాలతో అజెండా ఖరారైనట్లు తెలుస్తోంది. 9,10 షెడ్యూళ్లలోని ఆస్తుల విభజన, APSFC, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తిపన్ను పంపకం, HYDలోని భవనాల తిరిగి అప్పగింత, ఉమ్మడి సంస్థల వ్యయాల తిరిగి చెల్లింపు, విభజన చట్టంలో లేని ఆస్తుల ప్రస్తావన తదితర అంశాలపై సీఎంలు చర్చించనున్నారట. అయితే ఈ భేటీలో నీటి పంపిణీ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News July 5, 2024

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి

image

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన SA 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్లలో బ్రిట్స్(81), మారిజానె(57) అర్ధసెంచరీలతో రాణించారు. వస్త్రాకర్, రాధ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో భారత ప్లేయర్లు రోడ్రిగ్స్(53*), మంధాన(46) పోరాడినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 రన్సే చేశారు.

News July 5, 2024

30 ఏళ్లలో ఒక్క చీర కూడా కొనలేదు: సుధా మూర్తి

image

గత 30 ఏళ్లలో తాను ఒక్క చీర కూడా కొనలేదని రాజ్యసభ MP సుధామూర్తి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఉన్నవాటినే మళ్లీమళ్లీ కట్టుకుంటానన్నారు. ‘గంగానదిలో నచ్చినది వదిలేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో నాకు ఇష్టమైన షాపింగ్‌ను కాశీ యాత్రకు వెళ్లినప్పుడు వదిలేశా. అప్పట్నుండి పెద్దగా షాపింగ్ చేయలేదు. మా అమ్మలా పొదుపుగా జీవించాలనుకున్నా. అక్కాచెల్లెళ్లు, స్నేహితులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తుంటా’ అని అన్నారు.

News July 5, 2024

2, 3 రోజుల్లో కృష్ణాకు పట్టిసీమ నీళ్లు: మంత్రి నిమ్మల

image

AP: రానున్న రెండు, మూడు రోజుల్లో గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా పట్టిసీమ నిర్వహణ పనులు చేయకపోవడంతో గేట్లు, బోల్టులు తుప్పు పట్టిపోయి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 24 పంపుల్లో ప్రస్తుతం 15 పని చేస్తున్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యమిస్తామని వివరించారు.

News July 5, 2024

పోస్టుల పెంపుతో న్యాయపరమైన చిక్కులు: CMO

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ సెలక్షన్‌ను 1:50 నిష్పత్తికి బదులుగా 1:100కి మారిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని CMO ప్రకటనలో తెలిపింది. అలాగే పరీక్ష ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రూప్-2, 3 పోస్టుల పెంపు సాధ్యపడదని తెలిపింది. ఒకవేళ గ్రూప్-1 ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచే అవకాశం ఉన్నా గ్రూప్-2, 3కి అలాంటి సౌకర్యం లేదని పేర్కొంది.

News July 5, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

News July 5, 2024

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న MLC కవితతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని, ఈ కేసు విషయంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆమెకు చెప్పారు. కాగా కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీశ్ ఢిల్లీలో విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాదులతో కలిసి సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

News July 5, 2024

వాటికి ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి: కేంద్రం

image

స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలపై ఐఎస్ఐ మార్కును కేంద్రం తప్పనిసరి చేసింది. వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో వినియోగదారులకు భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ISI మార్క్ లేని పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకం, నిల్వపై నిషేధం ఉన్నట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని తెలిపింది. కాగా మార్చి 14న కేంద్రం ఆధ్వర్యంలోని DPIIT వంటపాత్రలపై నాణ్యత ప్రమాణ ఉత్తర్వులు జారీ చేసింది.

News July 5, 2024

ఉద్యోగాలపై సీఎం రేవంత్ ప్రకటన

image

TG: నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో పార్టీ విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలికావద్దని సూచించారు. DSC, గ్రూప్-2 పరీక్షల తేదీలపై టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

News July 5, 2024

నిరుద్యోగులంటే రేవంత్‌కు ప్రేమ, గౌరవం లేదు: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగులపై ప్రేమ, గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువతను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ‘తెల్ల దొరల కన్నా దారుణంగా పాలిస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాకంఠక పాలన. నిరుద్యోగ యువతను నమ్మించి వంచించింది. ఉద్యోగాలు ఇవ్వలేకపోయినందుకు వెంటనే ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.