India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన మండపాల్లో కరెంట్ షాక్‌తో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. APలోని రాయచోటిలో మహేశ్(13), పల్నాడులో దేవసహాయం, TGలోని కుత్బుల్లాపూర్‌లో నవీన్, హుజురాబాద్‌లో యశ్వంత్ మరణించారు. వేములవాడలోని కొనాయ్యపల్లిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
NOTE: వర్షాలు కురుస్తున్నందున మండపాల్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కాకుండా అప్రమత్తంగా ఉండండి.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌తో కలిసి డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడిన సమయంలోనే అతడిలోని గొప్పదనాన్ని గుర్తించినట్లు మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘2008 ఐపీఎల్‌లో తొలిసారిగా రోహిత్ శర్మతో కలిసి ఆడాను. అప్పటికి తనకు 19 ఏళ్లు ఉంటాయేమో. కానీ సాధారణ ఆటగాడు కాదని గుర్తించా. అద్భుతంగా ఆడేవారు. ఈ మధ్యే ఓ సిరీస్ సందర్భంగా మరోసారి కలిశాను. ఇప్పటికీ తనలో ఏ మార్పూ లేదు’ అని కొనియాడారు.
భారత టూరిస్టులకు దక్షిణాఫ్రికా గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దేశంలో వీసా లేకుండా 90 రోజులు పర్యటించేందుకు అనుమతినివ్వనుంది. తమ టూరిస్టుల్లో అత్యధికులు భారత్, చైనా నుంచే ఉన్న నేపథ్యంలో వారి సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత పర్యాటకుల సంఖ్య ఏటా 16వేలుగా ఉండగా, ఈ ఏడాది చివరికి దాన్ని లక్షకు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు. TGలో పడే వర్షాల వల్ల APకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. HYD సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
గడచిన ఏడాది కాలంలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం.. కోహ్లీ రూ.847 కోట్లు ఆర్జించారు. క్రిస్టియానో రొనాల్డో రూ. 2081కోట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2వ స్థానంలో స్పానిష్ గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహ్మ్(రూ.1712 కోట్లు), 3వ స్థానంలో మెస్సీ(రూ.1074 కోట్లు) ఉన్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.440 తగ్గి రూ.72,870కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గడంతో రూ.66,800 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,500 తగ్గి రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
AP: వరద సహాయక చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.కోటిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్‌ను విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్యంపై సీఎం ఆరా తీశారు. అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగంణంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి డిప్యూటీ సీఎం పూజలు చేశారు. కాగా పంచాయతీల అభివృద్ధికి మరో రూ.4 కోట్లను ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
‘స్త్రీ2’ పోస్టర్‌ను హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ నుంచి కాపీ కొట్టారన్న విమర్శలపై మూవీ డైరెక్టర్ అమర్ కౌశిక్ స్పందించారు. తాను అసలు ఆ సిరీస్ చూడనే లేదని వివరించారు. ‘నిజంగా చెబుతున్నా. నేను ఆ పోస్టర్స్ చూడలేదు. మా మూవీ పోస్టర్‌ను మా డిజైనర్ తయారుచేశారు. ఇది కాకతాళీయంగానే జరిగింది’ అని పేర్కొన్నారు. కాగా విడుదలైనప్పటి నుంచి స్త్రీ2 కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
6 రకాల విషయాల వల్ల మనిషిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత అమెరికన్ వైద్యుడు సౌరభ్ సేథీ ప్రకారం.. ‘మద్యపానం, ధూమపానం, సూర్యుడి యూవీ కిరణాలకు గురికావడం, తరచూ డీహైడ్రేషన్‌కు లోనవ్వడం, ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర పదార్థాల్ని తినడం, తరచూ ఒత్తిడికి లోనవ్వడం’ వంటివి వృద్ధాప్యాన్ని త్వరగా తీసుకొస్తాయి.
Sorry, no posts matched your criteria.