News September 10, 2024

బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: మూడు నెలల్లో బీసీ కులగణన పూర్తిచేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ కులగణన చెయ్యాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన పూర్తిచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

News September 10, 2024

16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!

image

సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్‌ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

News September 10, 2024

గ్లోబల్ స్టేజ్‌పై భారత్‌ను విస్మరించలేరు: కాంగ్రెస్ ఎంపీ

image

ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్‌ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్‌లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.

News September 10, 2024

నేను ప్రతిపక్షంలోనే ఉన్నా: MLA గాంధీ

image

TG: తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని శేరిలింగంపల్లి MLA అరికెపుడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానింకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వెల్లడించారు. తనకు CM రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, ఆలయానికి సంబంధించిన శాలువా అని చెప్పారు. గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.

News September 10, 2024

హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు

image

TG: HYDలోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.

News September 10, 2024

అప్పుడు.. రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తాం: రాహుల్ గాంధీ

image

భారత్ ‘ఫెయిర్ ప్లేస్‌’గా మారాక కాంగ్రెస్ రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తుందని LoP రాహుల్ గాంధీ USలో అన్నారు. ‘90% ఉన్న OBC, దళిత, ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. టాప్-10 వ్యాపారాలు, మీడియా పరిశ్రమ, బ్యూరోక్రాట్లు, అత్యున్నత కోర్టుల్లో వెనకబడిన వర్గాల వారు కనిపించరు. అందుకే కులగణన అవసరం. ఈ కులాల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకొనేందుకు సోషియో ఎకనామిక్ సర్వే సైతం చేపట్టాలి’ అని ఆయన అన్నారు.

News September 10, 2024

వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం: మంత్రి నారాయణ

image

AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.

News September 10, 2024

ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపైకి తారక్, అల్లు అర్జున్?

image

ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌పైనా భారీ అంచనాలున్నాయి.

News September 10, 2024

బిల్లులు క్లియర్ చేయండి: యూనస్‌కు అదానీ లేఖ

image

బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.

News September 10, 2024

ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి సన్మానం

image

TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్‌సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.