News May 5, 2024

WCకు ఎంపిక.. 2 మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్

image

CSK హిట్టర్ శివమ్ దూబేను ఇటీవల BCCI టీ20 WCకు ఎంపిక చేసింది. 9 మ్యాచుల్లో 350 రన్స్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతడికి ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆ తర్వాతి 2 మ్యాచుల్లో దూబే గోల్డెన్ డకౌట్ అవ్వడం గమనార్హం. ఈనెల 1న PBKSతో మ్యాచులో తొలి బంతికే ఔటైన దూబే.. ఇవాళ మళ్లీ అదే జట్టుతో గేమ్‌లోనూ ఫస్ట్ బాల్‌కే వెనుదిరిగాడు. దీంతో దూబే ఫామ్‌పై టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

News May 5, 2024

రేపు లేదా ఎల్లుండి అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: వడగండ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు EC అనుమతి ఇచ్చింది. యాసంగి సీజన్‌లో మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వర్షాలతో 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు రూ.15.81 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఎన్నికల కోడ్‌తో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా EC అనుమతితో సోమవారం లేదా మంగళవారంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.

News May 5, 2024

మరో రెండు గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురవనుందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, NLG, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురవనున్నట్లు పేర్కొంది. కొత్తగూడెం, జనగామ, MBNR, ములుగు, నాగర్‌కర్నూల్, RR, సంగారెడ్డి, VKB, WGL జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడనున్నట్లు వెల్లడించింది. మరోవైపు పిడుగుపాటుకు వరంగల్, ఏటూరునాగారంలో ఇద్దరు రైతులు మృతి చెందారు.

News May 5, 2024

ఆస్ట్రేలియాలో మహిళా ఎంపీపై అత్యాచారయత్నం

image

ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీపైనే అత్యాచారయత్నం ఘటన సంచలనం రేపింది. క్వీన్‌ల్యాండ్స్ MP, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి బ్రిటనీ లాగా(37) ఇటీవల లైంగిక వేధింపులకు గురయ్యారు. కొందరు దుండగులు తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News May 5, 2024

IPL: టాస్ గెలిచిన లక్నో

image

ఎకానా స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచులో లక్నో టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నారు. KKR: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమన్‌దీన్, స్టార్క్, చక్రవర్తి, హర్షిత్LSG: రాహుల్, స్టోయినిస్, దీపక్ హుడా, పూరన్, టర్నర్, బదోనీ, కృనాల్, బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

News May 5, 2024

FLASH: పంజాబ్‌పై CSK విజయం

image

ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 28 పరుగుల తేడాతో CSK విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన PBKS 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా అందరూ విఫలమయ్యారు. జడేజా 3, సిమర్‌జీత్ సింగ్, తుషార్ చెరో రెండు వికెట్లు, శాంట్నర్, శార్దూల్ చెరో వికెట్ తీశారు.

News May 5, 2024

సజ్జల భార్గవ్‌పై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

image

AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశించింది. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో టీడీపీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. విచారణకు ఆదేశించింది.

News May 5, 2024

476 మంది కోటీశ్వరులు, 360 మందిపై క్రిమినల్ కేసులు

image

నాలుగో విడత ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. మొత్తం 1,717 మంది బరిలో ఉండగా, 1,710 మంది అఫిడవిట్‌లను ADR విశ్లేషించింది. వారిలో 476 మంది(28 శాతం) కోటీశ్వరులేనని వెల్లడించింది. 360 మంది(21 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అందులో 274 మందిపై తీవ్రమైన నేరారోపణలు(హత్య, అత్యాచారం) ఉన్నాయంది. <<-se>>#ELECTIONS2024<<>>

News May 5, 2024

ఉగ్రదాడి.. బీజేపీ ఎలక్షన్ స్టంట్: మాజీ సీఎం

image

జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో వాయుసేన గస్తీ బృందంపై నిన్న ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ CM చరణ్‌జిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది BJP ఎలక్షన్ స్టంట్ అని.. ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రజల జీవితాలతో BJP చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరుగుతాయని.. ఇలాంటి దాడులే గత ఎన్నికల సమయంలోనూ జరిగాయని పేర్కొన్నారు.

News May 5, 2024

వారిద్దరికీ ముంబై రెస్ట్ ఇస్తుందా..?

image

కేకేఆర్‌పై ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో ఇకపై ఆడే మ్యాచ్‌లు నామమాత్రమే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, బుమ్రాలకు జట్టు రెస్ట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వారిద్దరూ తీరిక లేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. విశ్రాంతినిస్తే టీ20 వరల్డ్ కప్‌‌లో గాయాలపాలు కాకుండా ఉంటారని అంటున్నారు. మరి అభిమానుల కోరికను ముంబై గౌరవిస్తుందా? రేపు SRHతో జరిగే మ్యాచ్‌లో దీనిపై ఓ క్లారిటీ రానుంది.