News May 5, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో తీవ్ర గందరగోళం

image

APలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటేసేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఓటు ఇక్కడ లేదంటూ ఆయా కేంద్రాల సిబ్బంది చెప్పడంతో చాలా మంది ఓటు హక్కు కోల్పోయారు. తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కడుందో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కాగా ఈ నెల 7,8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం కల్పించారు.

News May 5, 2024

IPL: నరైన్ విధ్వంసం.. KKR భారీ స్కోర్

image

LSGతో మ్యాచ్‌లో KKR 20 ఓవర్లలో 235/6 స్కోర్ చేసింది. సునీల్ నరైన్ 39 బంతుల్లో 81 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. ఫిలిప్ సాల్ట్ 32, రఘువంశీ 32, రస్సెల్ 12, రింకూ సింగ్ 16, శ్రేయస్ అయ్యర్ 23, రమణ్‌దీప్ 25* పరుగులు చేశారు. నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

News May 5, 2024

ఏ ఒక్క పథకమూ ఆగదు: చంద్రబాబు

image

AP: కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆపమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సూపర్ సిక్స్, మోదీ హామీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అన్నమయ్య(D) అంగళ్లులో ప్రజాగళం సభలో మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రచందనం, మైనింగ్, ఇసుక మాఫియా నడుస్తోంది. ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు. ఇలాంటి పాలకులు మనకు అవసరమా?’ అని ప్రశ్నించారు.

News May 5, 2024

మార్గమధ్యలో చాయ్ తాగి.. అభిమానులతో సెల్ఫీలు దిగి..

image

TG: మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆయన మార్గమధ్యలో ఓ దాబా వద్ద ఆగారు. అక్కడ చాయ్ తాగి, సమోసా తిన్నారు. దీంతో ఆయనను చూసిన పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చిన్నారులు, పెద్దలతో కేసీఆర్ సెల్ఫీలు దిగి కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు.

News May 5, 2024

‘టైటానిక్’ నటుడు మృతి

image

హాలీవుడ్ నటుడు, టైటానిక్ ఫేమ్ బెర్నార్డ్ హిల్(79) కన్నుమూశారు. టైటానిక్‌లో అయన కెప్టెన్ ఎడ్వర్డ్‌ స్మిత్‌ పాత్రతో సినీ అభిమానులకు సుపరిచితుడు. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తదితర చిత్రాల్లోనూ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1944లో యూకేలోని మంచెస్టర్‌లో జన్మించిన హిల్.. పలు చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు, సినీ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

News May 5, 2024

నాలుగో విడతలో 26 మంది నిరక్షరాస్యులు

image

నాలుగో విడత ఎన్నికల్లో 1,717 మంది బరిలో ఉండగా, వారిలో 26 మంది నిరక్షరాస్యులని ADR వెల్లడించింది. అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా 944 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు అభ్యసించినట్లు పేర్కొంది. 66 మంది డిప్లొమా, 644 మంది ఆరు నుంచి 12వ తరగతి పూర్తి చేయగా, 30 మంది కేవలం అక్షరాస్యులని తెలిపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 5, 2024

ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూకార్నర్ నోటీసులు

image

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న JDS MP ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. డిప్లొమాటిక్ పాస్‌పోర్టుతో జర్మనీకి వెళ్లిన అతడి కోసం ఇంటర్‌పోల్‌ ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసినట్లు కర్ణాటక మంత్రి పరమేశ్వర వెల్లడించారు. త్వరలోనే అతడిని ఇండియాకు రప్పిస్తామన్నారు. కాగా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణను సిట్ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

News May 5, 2024

ఇంటర్‌పోల్.. అది ఇచ్చే నోటీసులు(1/3)

image

ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్‌నే ఇంటర్‌పోల్ అంటారు. ఇందులో 187 దేశాలకు సభ్యత్వం ఉంది. అన్ని దేశాల క్రిమినల్ ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడికి ఇది సహకరిస్తుంది. అలాగే ఒక దేశంలోని నేరగాళ్లను మరో దేశానికి అప్పగిస్తుంది. దేశాలు, ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు నిందితులు లేదా వ్యక్తుల కోసం ఇంటర్‌పోల్ 7 రకాల నోటీసులు(రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, బ్లాక్, ఆరెంజ్, పర్పుల్) జారీ చేస్తుంది.

News May 5, 2024

ఇంటర్‌పోల్.. అది ఇచ్చే నోటీసులు(2/3)

image

రెడ్ కార్నర్: మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల కోసం దీన్ని జారీ చేస్తారు. నిందితుడు ఏ దేశంలో ఉన్నా.. ఆచూకీని గుర్తించి అరెస్టు చేస్తారు.
ఎల్లో నోటీస్: తప్పిపోయిన వ్యక్తులను, మైనర్లను, మతిస్థిమితం లేనివారిని గుర్తించడం కోసం..
బ్లూ నోటీస్: నేరస్థుడిని గుర్తించి, ఆ సమాచారాన్ని సంబంధిత దేశానికి ఇవ్వడం కోసం..
బ్లాక్ నోటీస్: ఇతర దేశాల్లో గుర్తు తెలియని మృతదేహాల సమాచారం కోరుతూ..

News May 5, 2024

ఇంటర్‌పోల్.. అది ఇచ్చే నోటీసులు(3/3)

image

గ్రీన్ నోటీస్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న, ప్రజా భద్రతకు ముప్పు తెస్తోన్న వారి గురించి హెచ్చరించడానికి..
ఆరెంజ్ నోటీస్: ప్రాణ నష్టం లేదా ఆస్తి ప్రమాదం, భారీ ముప్పు రాబోతోందని హెచ్చరించడానికి..
పర్పుల్ నోటీస్: క్రిమినల్స్ ఉపయోగించిన వస్తువులు, పరికరాలు, వారు ఆశ్రయం పొందిన స్థలాల సమాచారాన్ని అందించడానికి..