News September 7, 2024

మహాభారతం రాసేందుకు వినాయకుడు విధించిన షరతు ఏంటంటే..!

image

మహాభారతాన్ని వేదవ్యాసుల వారు బోధించగా వినాయకుడు రాసినట్లు పురాణ ప్రశస్తి. అయితే.. రాసేందుకు గణేశుడు ఓ షరతు విధించినట్లు కథనం ఉంది. దాని ప్రకారం.. రాయడానికి తనకు అంగీకారమేనని, కథ మొత్తం ఏకధాటిగా చెప్పాలని ఆయన షరతు పెట్టాడట. వ్యాసులవారు చెప్పడం ఆగితే తాను కూడా రాయడం ఆపేస్తానని అనడంతో ఏకధాటిగా మూడేళ్ల పాటు వ్యాసుల వారు భారతాన్ని వినిపించారని ఓ కథనం.

Similar News

News July 8, 2025

ఎల్లుండి నుంచి 16 బోగీలతో కాచిగూడ వందేభారత్

image

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 ఛైర్‌కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 బోగీలు ఉండగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14CC, 2 EC కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. కాగా బుధవారం మినహా ప్రతిరోజూ ఈ రైలు ఉ.5.45కు కాచిగూడలో బయల్దేరి మ.2 గంటలకు యశ్వంత్‌పూర్, అలాగే మ.2.45కు అక్కడ బయల్దేరి రా.11 గంటలకు కాచిగూడ చేరుతుంది.

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 8, 2025

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ఫ్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 83,458 పాయింట్లు లాభపడగా, Nifty ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, NTPC, ఇండస్ ఇండ్, ICICI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.