News September 13, 2024
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. 100కోట్లకు చేరిన ఫాలోవర్ల సంఖ్య
పోర్చుగీస్ ఫుట్‌బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ‘ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 5, 2024
హర్షసాయిపై లుక్‌అవుట్ నోటీసులు
TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి?
ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.
News October 5, 2024
TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు
AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.