News July 5, 2024

సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN

image

TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.

News July 5, 2024

14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

image

బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.

News July 5, 2024

రిషి సునాక్ ఓటమి.. మరోసారి మూర్తి సలహా వైరల్!

image

యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. తన మామగారి సలహాను పాటించకపోవడంతోనే రిషి ఓడిపోయారేమోనంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూర్తి చెప్పిన సూత్రాన్ని UKలో అమలు చేస్తారేమోనని ఓడించారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News July 5, 2024

రక్షణ ఉత్పత్తుల్లో రికార్డు

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో PM ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

News July 5, 2024

భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు?

image

హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలేకు ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నట్లు సమాచారం. ఆయనకు 16 మంది బాడీగార్డులు, 15 నుంచి 30 ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న మెయిన్‌పురి ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆయన భార్య కోసం 6 లగ్జరీ రూమ్స్ కూడా ఉన్నాయట.

News July 5, 2024

పవన్ సినిమాపై రూమర్స్.. డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై!

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోనున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే టైమ్ కూడా లేదు’ అని ఓ నెటిజన్‌కు Xలో రిప్లై ఇచ్చారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

News July 5, 2024

కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు

image

TG: తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారంటూ KCR, BRS పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలపై తక్షణమే లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో సీతక్క డిమాండ్ చేశారు.

News July 5, 2024

రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

image

రెండు మంత్రి పదవులు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఆశించలేదని ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా AP CM చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చని వివరించారు. ఢిల్లీ నుంచి నేరుగా HYD బయల్దేరిన ఆయన రేపు TG CM రేవంత్‌తో భేటీ కానున్నారు.

News July 5, 2024

బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

image

బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.

News July 5, 2024

నిన్నటి ఈవెంట్ బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్: ఆదిత్య ఠాక్రే

image

నిన్న ముంబైలో జరిగిన T20 వరల్డ్ కప్ విజయోత్సవం ముంబై నుంచి WC ఫైనల్‌ను తీసివేయొద్దనే ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ని బీసీసీఐకి ఇచ్చాయని శివసేన(UBT) నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ గత ఏడాది వన్డే WC ఫైనల్ ముంబైలో కాకుండా అహ్మదాబాద్‌లో నిర్వహించడం గురించే చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా అభిమానులు పోటెత్తేవారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.