News July 5, 2024

కశ్మీర్ వ్యతిరేక పార్టీకి బ్రిటన్‌లో అధికారం.. INDతో బంధం కొనసాగేనా?(1/2)

image

బ్రిటన్ ఎన్నికల్లో ఘనవిజయంతో కైర్ స్టార్మర్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా లేబర్ పార్టీ భావజాలం ఉండటంతో 2 దేశాల బంధం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కశ్మీర్ ప్రజలకు నిర్ణయాధికారం ఇవ్వాలని, అక్కడికి అంతర్జాతీయ పరిశీలకులను పంపాలంటూ ఆ పార్టీ నేత జెరెమీ 2019లో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ పార్టీవి ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ అప్పట్లో భారత్ తీవ్రంగా మండిపడింది.

News July 5, 2024

టికెట్ల ధరలపై అపోహలు.. కల్కి నిర్మాత కీలక ప్రకటన

image

సినిమా టికెట్ రేట్ల విషయంలో తన <<13561949>>వ్యాఖ్యలతో<<>> అపోహలు వస్తున్నాయని నిర్మాత సి.అశ్వనీదత్ తెలిపారు. ‘సినిమా టికెట్ల రేట్ల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ఓ శాశ్వత ప్రతిపాదన చేయాలని పవన్ అన్నారు. నిర్మాతలంతా కూలంకషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్‌ను బట్టి రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు? వారమా? 10 రోజులా? అనే నిర్ణయానికి వస్తే సీఎంతో చర్చిస్తానని పవన్ అన్నారు’ అని Xలో స్పష్టం చేశారు.

News July 5, 2024

ముంబై పోలీసులకు థాంక్స్: కోహ్లీ

image

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ యాత్రకు అభిమానులు అసంఖ్యాకంగా వచ్చారు. ఆ పరిస్థితిని ముంబై పోలీసులు సమర్థంగా ఎదుర్కొని శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూశారు. ఈ నేపథ్యంలో వారికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. ‘టీం ఇండియా విక్టరీ పరేడ్‌లో తిరుగులేని సమర్థత చూపించిన ముంబై పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నిబద్ధత, సేవ అద్భుతం. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

News July 5, 2024

BREAKING: హీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు

image

TG: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు. ‘11 ఏళ్లుగా మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. శారీరకంగానూ ఒక్కటయ్యాం. ఒకే ఇంట్లో ఉంటున్నాం. రాజ్ తన కొత్త సినిమాలో హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకున్నాడు. అతడిని ప్రశ్నించినందుకు నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని లిఖితపూర్వక ఫిర్యాదులో పోలీసులను కోరారు.

News July 5, 2024

ఐపీఓకు సిద్ధపడుతున్న జియో?

image

టారిఫ్ పెంచి, 5జీ మానిటైజేషన్‌కు జియో సన్నాహాలు చేస్తుండటంతో ఇతర నెట్‌వర్క్‌లూ అదే ఫాలో అవుతున్నాయి. అయితే ఐపీఓ లాంచ్‌కు జియో సిద్ధపడుతోందనడానికి ఇవి సూచనలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఐపీఓ ఉండొచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు.

News July 5, 2024

అమరావతి నిర్మాణానికి టీడీపీ ఎంపీ విరాళం

image

AP: అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని విరాళంగా అందించారు. ఎంపీగా ఇటీవల తొలి జీతం రూ.1.57 లక్షలు అందుకున్న ఆయన.. ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు అప్పగించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడుని సీఎం అభినందించారు.

News July 5, 2024

ఇండియాలో ‘కల్కి’ మేనియా.. జపాన్‌లో నేడు ‘సలార్’ రిలీజ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్-1’ జపాన్‌లో ఇవాళ రిలీజైంది. గతేడాది డిసెంబర్ 22న భారత్‌లో రిలీజైన ఈ సినిమా ఆరు నెలల తర్వాత జపనీయులను మెప్పించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో IMAX-జపాన్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేస్తోంది. ప్రభాస్ సినిమాలకు జపాన్‌లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘కల్కి’ చూసేందుకు జపాన్ నుంచి పలువురు HYDకు వచ్చారు.

News July 5, 2024

RTC బస్సులో మహిళకు పురుడు పోసిన కండక్టర్

image

TGSRTC సిబ్బంది మరోసారి మానవత్వం చాటుకున్నారు. HYDకు చెందిన శ్వేతారత్నం అనే మహిళ ఆరాంఘర్‌లో 1Z నంబర్ బస్సెక్కారు. బహదూర్‌పుర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. గమనించిన కండక్టర్ సరోజ మహిళా ప్రయాణికుల సాయంతో బస్సులోనే ప్రసవం చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. కండక్టర్ సమయస్ఫూర్తిని అంతా ప్రశంసిస్తున్నారు.

News July 5, 2024

రాష్ట్రాన్ని ఆదుకోండి.. నిర్మలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

image

AP: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌, NDA ఎంపీలు పాల్గొన్నారు. మరికొందరు కేంద్రమంత్రులతోనూ సీఎం నేడు భేటీ కానున్నారు.

News July 5, 2024

ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లలో 11% వృద్ధి!

image

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నెల రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ చెరో 11శాతం వృద్ధిచెందాయి. దేశీయ స్టాక్స్‌లో మళ్లీ విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. 2014, 2019లో రిజల్ట్స్ అనంతరం నెల రోజుల్లో నమోదైన వృద్ధితో పోలిస్తే ఈసారి మెరుగ్గా ఉంది. 2014లో సెన్సెక్స్ 4.43% వృద్ధి నమోదు కాగా, 2019లో అది 1%కు పరిమితమైంది. కాగా 2009లో సెన్సెక్స్ 22% వృద్ధి నమోదు కావడం గమనార్హం.