News July 4, 2024

ఆర్టికల్ 361పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళ

image

బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్‌ తనను లైంగికంగా వేధించారంటూ <<13170816>>ఆరోపించిన<<>> ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు గవర్నర్ అధికారిక విధుల్లో భాగంగా పరిగణిస్తారా? గవర్నర్ పదవిని కోల్పోయే వరకు న్యాయం కోసం ఎదురుచూడాలా? నా లాంటి బాధితురాలికి కోర్టు ఉపశమనం కలిగిస్తుందా? లేదా? అనేది చెప్పాలి’ అని కోరారు.

News July 4, 2024

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు దాదాపు అరగంట పాటు ముచ్చటించారు.

News July 4, 2024

నెలలో తిరిగిచ్చేస్తానంటూ చోరీ చేసిన దొంగ!

image

ఇంట్లో ఆరోగ్య చికిత్స కోసం తప్పట్లేదని, దోచుకున్న సొత్తును నెలరోజుల్లో తిరిగిచ్చేస్తానని ఉత్తరం రాసి మరీ ఓ దొంగ చోరీ చేయడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చెందూర్‌కు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం గత నెల చెన్నై వెళ్లింది. ఈ నెల 1న తిరిగొచ్చాక ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో దొంగ రాసిన ఉత్తరాన్ని పోలీసులు గుర్తించారు.

News July 4, 2024

నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్!

image

ఈరోజు సెషన్‌లో నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 24వేల మార్క్ (24,400) చేరి సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. మరోవైపు నిన్న 80వేల మార్క్ చేరిన సెన్సెక్స్ ఈరోజు అదే జోరు కొనసాగిస్తోంది. 344 పాయింట్ల లాభంతో సూచీ 80,334 వద్ద ట్రేడవుతోంది. ICICI బ్యాంక్, HCL టెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, NTPC నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. మరోవైపు నిన్న 3% వృద్ధిని నమోదు చేసిన HDFC ఈరోజు నష్టాల్లో కొనసాగుతోంది.

News July 4, 2024

‘కల్కి’ హీరో అమితాబేనని ప్రభాస్ అన్నారు: అశ్వనీదత్

image

‘కల్కి 2898ఏడీ’ సినిమా కలెక్షన్ల వర్షంతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ హీరో ప్రభాస్‌పై నిర్మాత అశ్వనీదత్ ప్రశంసలు కురిపించారు. ‘కల్కిలో కమల్ కూడా ఉన్నారని తెలిసి ప్రభాస్ చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇక మూవీకి తొలి హీరో అమితాబే అని, ఆయనకు గౌరవం ఇస్తేనే మనకూ గౌరవమని మాతో అన్నారు. హ్యాట్సాఫ్ టు ప్రభాస్. ఈ సినిమాకు ఆయన పనిచేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని పేర్కొన్నారు.

News July 4, 2024

కాంగ్రెస్‌లోకి మరో BRS ఎమ్మెల్యే?

image

TG: BRS గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ వారం రోజుల్లో ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై ప్రశ్నించగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLA చెప్పడం గమనార్హం. ఒకవేళ పార్టీ మారే ఆలోచన లేకపోతే ఆ వార్తలను కొట్టిపారేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News July 4, 2024

వచ్చే నెలలో సలార్-2 షూటింగ్ మొదలు?

image

‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు షెడ్యూల్ సాగుతుందని తెలుస్తోంది. ప్రభాస్, పృథ్వీరాజ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారని టాక్. గతేడాది విడుదలైన సలార్ మూవీ మంచి కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.

News July 4, 2024

ఢిల్లీలో సీఎం చంద్రబాబు మీటింగ్స్ ఇలా..

image

AP: సీఎం చంద్రబాబు నేడు, రేపు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉ.10.15 గంటలకు PM మోదీతో కీలక అంశాలపై చర్చిస్తారు. మ.12.15కు గడ్కరీ, మ.2గంటలకు శివరాజ్‌సింగ్, మ.2.45కు అమిత్ షా, సా.5.15కు మనోహర్ లాల్ ఖట్టర్, సా.6 గంటలకు హర్దీప్ సింగ్ పురీతో భేటీ అవుతారు. రేపు ఉ.9 గంటలకు నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం, ఉ.10కి నిర్మలా సీతారామన్, ఉ.10.45కు జేపీ నడ్డా, మ.12.30కు రామ్‌దాస్ అఠావలెతో సమావేశమవుతారు.

News July 4, 2024

దొడ్డి కొమురయ్యకు CM రేవంత్ నివాళి

image

TG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క, తెలంగాణలో హక్కుల సాధనకు వేగుచుక్క దొడ్డి కొమురయ్య అని సీఎం రేవంత్ కీర్తించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు.

News July 4, 2024

వరదలతో ఈశాన్యం అతలాకుతలం

image

నదులు ఉగ్రరూపం దాల్చడంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరస వరదలతో వణికిపోతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్‌లో నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అస్సాంలో వరదలకు 8మంది బలయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 16 లక్షలమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చైనా, భూటాన్, అరుణాచల్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.