News July 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 4, 2024

జడ్జిలు, రాజకీయ ప్రముఖుల ఫోన్‌లను ట్యాప్ చేశారు: పోలీసుల అఫిడవిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేశారు. ఇప్పటికే నలుగురు పోలీసులను అరెస్ట్ చేశాం. ఓ మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేసి మెటీరియల్ సీజ్ చేశాం. కేసు నమోదు కాగానే ఎస్ఐబీ మాజీ చీఫ్ దేశం వదిలి వెళ్లిపోయారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News July 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 4, 2024

కూటమి ఎంపీలతో ముగిసిన చంద్రబాబు భేటీ

image

AP: ఢిల్లీలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో డిన్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన తండ్రి డి.శ్రీనివాస్ మరణించడంతో అర్వింద్‌ను సీఎం పరామర్శించారు. కాగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

News July 4, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 04, గురువారం
త్రయోదశి: ఉదయం 05:34 గంటలకు
చతుర్దశి: తెల్లవారుజామున 04:40 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 09:53- 10:45 గంటల వరకు,
మధ్యాహ్నం 03:06- 03:58 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 01:30 -03:00 గంటల వరకు

News July 4, 2024

HEADLINES

image

*అమరావతిపై శ్వేతపత్రం విడుదల
*అమరావతిని నాశనం చేశారు.. పునర్నిర్మిస్తాం: CBN
*కుదిరినప్పుడు సినిమాలు చేస్తా: పవన్ కళ్యాణ్
*AP: ఉచితంగా ఇసుక పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర
*AP: గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
*TG: రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు: డిప్యూటీ సీఎం భట్టి
*TG: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి
*మణిపుర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కృషి: మోదీ
*హాథ్రస్ ఘటనలో 121కి చేరిన మరణాలు

News July 3, 2024

రేపు టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే..

image

*ఉ.6 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.
*ఉ.9.30 గంటలకు ప్రధాని మోదీతో అల్పాహార విందు
*మరో విమానంలో ముంబైకి బయల్దేరనున్న ప్లేయర్లు
*సా.4 గంటలకు ముంబైలో ల్యాండింగ్
*సా.5 గంటలకు నారిమన్ పాయింట్‌లో ఓపెన్ బస్ ఎక్కనున్న క్రికెటర్లు
*సా.5 నుంచి రా.7 వరకు ఓపెన్ బస్ పరేడ్
*రా.7 నుంచి రా.7.30 వరకు వాంఖడే స్టేడియంలో ఫంక్షన్

News July 3, 2024

విజయవాడలో ఏపీఎండీసీ ఫైల్స్ దగ్ధం.. ఘటనపై అనుమానాలు?

image

AP: విజయవాడలో ఏపీఎండీసీ ఫైళ్ల దహనం ఘటన కలకలం రేపింది. పెదపులిపాక కరకట్ట వద్ద కొందరు కారులో వచ్చి ఫైళ్లను తగలబెట్టారు. దస్త్రాలు తగలబడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లడంతో వారు కారులో పరారయ్యారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

News July 3, 2024

ఏపీలో షూటింగ్స్‌కోసం తహతహలాడుతున్నాం: నరేశ్

image

AP: రాష్ట్రంలో సినిమాలు తీసేందుకు సినీ పరిశ్రమ తహతహలాడుతోందని నటుడు నరేశ్ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కొత్త ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మంచి లోకేషన్లు, ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రంలో పరిశ్రమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. వచ్చే ఐదేళ్లలో రాజధాని, పోలవరం పూర్తవుతాయనుకుంటున్నా’ అని తెలిపారు.

News July 3, 2024

అద్వానీకి మరోసారి అస్వస్థత

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించారు.