News July 3, 2024

బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. వార్నింగ్ ఇచ్చిన సంజన

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించారు. తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘నా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని ఎవరో దొంగిలించి అచ్చం నా అకౌంట్ లాగే మరో ఖాతా తెరిచారు. వెంటనే దీనిని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.

News July 3, 2024

కంగనాను కొట్టిన జవాన్‌ బదిలీ

image

గత నెలలో ఢిల్లీ వస్తున్న నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్టులో CISF మహిళా జవాను కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో సదరు జవానును CISF విధుల నుంచి తప్పించింది. తాజాగా ఆమెను బెంగళూరులోని రిజర్వు బెటాలియన్‌కు సంస్థ బదిలీ చేసింది. అయితే ఆమెపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

News July 3, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా

image

AP: ఈనెల 28న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి.

News July 3, 2024

రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు: భట్టి

image

TG: రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని, కేవలం విద్యుత్ అంతరాయాలు మాత్రమే ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్‌లోకి రమ్మని మేం అడగడం లేదు. కేసీఆర్ అన్యాయాన్ని అరికట్టాలని వారే వస్తున్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పీసీసీ నియామక కసరత్తు మొదలైంది. ప్రజలు కోరుకుంటే కొండలు, గుట్టలకూ రైతు భరోసా ఇస్తాం’ అని పేర్కొన్నారు.

News July 3, 2024

అవన్నీ తప్పుడు ప్రచారాలే: టీటీడీ

image

AP: అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ‘స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చించిన మాట వాస్తవం. అయితే వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది.

News July 3, 2024

టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

image

AP: బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో అనవసరమని తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని ఓ పోస్ట్ పెట్టారు. ‘కంభంపాడులో YCP నేత చెన్నారావుకు అక్కడి అధికారులు ఇన్ని రోజులు వంత పాడారు. నేను అక్రమ భవన కూల్చివేతకు సిద్ధపడటంతో ఇప్పుడు అరెస్ట్ చేపిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు కొలికపూడిని వివరణ కోరారు.

News July 3, 2024

వాలంటీర్లు లేకున్నా పింఛన్లు పంపిణీ చేశాం: పవన్

image

AP: వాలంటీర్లు లేకపోతే పథకాలు రావంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఒక్క వాలంటీర్‌ సహాయం లేకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించి దాదాపు ఒక్కరోజులో పింఛన్లు పూర్తి చేశామని వివరించారు. దీనికి ఎంతో అనుభవం కావాలని, అందుకే అపార అనుభవం ఉన్న చంద్రబాబుతో కూటమి ఏర్పాటు చేశామని పవన్ వెల్లడించారు.

News July 3, 2024

ఫలితాలు విడుదల

image

TG: బాసర ఆర్జీయూకేటీ 2024-25 ఫలితాలు విడుదలయ్యాయి. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్‌కు సంబంధించిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://www.rgukt.ac.in/

News July 3, 2024

భక్తులను బాబా సెక్యూరిటీ తోయడంతో తొక్కిసలాట: SDM

image

హాథ్రస్ ఘటనపై సబ్‌ డివిజనల్ మెజిస్ట్రేట్(SDM) సికంద్ర రావు వివరణ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో ‘కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబా వెళ్తుండగా ఆయన కాళ్ల కింది మట్టి తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. ఆయన సెక్యూరిటీ వారిని తోసేశారు. కొంతమంది కిందపడటంతో అది తొక్కిసలాటకు దారి తీసింది’ అని పేర్కొన్నారు. కాగా 121 మంది మరణించిన సత్సంగ్‌కు అనుమతి ఇచ్చింది ఈయనే.

News July 3, 2024

DCM పదవి నేను కోరుకోలేదు: పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పదవిని తాను కోరుకోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘YCP నేతలు నన్ను అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్లేలా చేశారు. పిఠాపురం విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.