News July 3, 2024

రేవంత్, చంద్రబాబు గురుశిష్యులు కాదు: భట్టి

image

TG: సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు గురుశిష్యులు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వారిద్దరూ సహచరులు మాత్రమేనని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పేర్కొన్నారు. ‘ఎవరూ అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. ఈ విషయం గురించి రేవంత్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. సహచరులు. అంతే’ అని పేర్కొన్నారు.

News July 3, 2024

అన్‌అకాడమీలో మరోసారి ఉద్యోగాల కోత

image

వివిధ విభాగాలకు చెందిన 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్అకాడమీ ప్రకటించింది. ఆర్థికభారం సహా వ్యాపారాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తొలగింపు చేపట్టినట్లు తెలిపింది. కాగా ఈ సంస్థ ఇలా లేఆఫ్స్ ప్రకటించడం ఇది మూడోసారి. గత ఏడాది మార్చిలో సుమారు 380 మందిని తొలగించగా, 2022 ఏప్రిల్‌లో దాదాపు వెయ్యి మందిని తప్పించింది.

News July 3, 2024

ఇషాన్ కిషన్ కెరీర్ ముగిసినట్లేనా?

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. భారత్ తరఫున ఏ సిరీస్‌కూ BCCI ఇషాన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరకు జింబాబ్వే టీ20 పర్యటనకు కూడా ఆయనను సెలక్ట్ చేయలేదు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు ఇషాన్ అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నారు. కానీ బోర్డుతో విభేదాలు తలెత్తడంతో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.

News July 3, 2024

భారత్ తన బ్రాండ్ నిలబెట్టుకుంది: పాక్ క్రికెటర్

image

T20 WC గెలిచి మరోసారి టీమ్ ఇండియా తన బ్రాండ్ నిలబెట్టుకుందని పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది ప్రశంసలు కురిపించారు. ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. ‘ఫైనల్‌లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని ఏ జట్టు రాణిస్తుందో అదే ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఫైనల్లో టీమ్ ఇండియా ఒత్తిడిని జయించి విజేతగా నిలిచింది. కప్ అందుకునేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News July 3, 2024

హేమంత్ సోరెన్‌కు మళ్లీ సీఎం పగ్గాలు?

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనను శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా చంపై సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.

News July 3, 2024

రండి.. ఈ అపురూప విజయాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం: రోహిత్

image

ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే విక్టరీ పరేడ్‌కు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. దీంతో 2007 T20 WC బస్ పరేడ్‌ను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. MS ధోనీ సారథ్యంలోని ఇండియన్ టీమ్ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి తిరిగివచ్చింది. వీరిని స్వాగతించేందుకు వేలాది మంది తరలివచ్చారు. అయితే ఇంతకంటే ఎక్కువ మంది రేపు పరేడ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

News July 3, 2024

బుమ్రా కోహినూర్ కంటే విలువైన బౌలర్: దినేశ్ కార్తీక్

image

టీం ఇండియా బౌలర్ బుమ్రా కోహినూర్ వజ్రం కంటే విలువైనవారని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొనియాడారు. ‘ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ తిరుగులేని బౌలర్ బుమ్రానే. ఎంత ఒత్తిడిలోనైనా రాణించగలగడం అతడి బలం. బుమ్రా వంటి బౌలర్ ఉండటం ఏ కెప్టెన్‌కైనా ఓ వరం. ఏ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చినా మ్యాచ్ గతిని మార్చగలడు. అతడి గొప్పదనాన్ని చెప్పేందుకు మాటలు సరిపోవు’ అని కితాబిచ్చారు.

News July 3, 2024

ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక: మంత్రి కొల్లు

image

AP: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇసుక విధానంతో ఐదేళ్ల పాటు పేదలను దోచుకుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం’ అని ఆయన పేర్కొన్నారు.

News July 3, 2024

విక్టరీ పరేడ్‌లో మాతో భాగమవ్వండి: జై షా

image

బార్బడోస్ నుంచి స్వదేశానికి వస్తోన్న టీమ్ఇండియాకు ఘన స్వాగతం పలికేందుకు BCCI ఏర్పాట్లు చేసింది. రేపు సా.5 గంటలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే విక్టరీ పరేడ్‌లో తమతో భాగమవ్వాలని సెక్రటరీ షా పిలుపునిచ్చారు. వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ జట్టు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని సత్కరించి రూ.125 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.

News July 3, 2024

రేపు ప్రధాని మోదీతో CBN భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను వివరించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అవుతారు. వారికి పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు.