News July 3, 2024

గాయత్రి మంత్రాన్ని చీరపై ముద్రించుకున్న నీతా అంబానీ

image

తన కుమారుడి పెళ్లి వేడుకల్లో భాగంగా ముకేశ్ అంబానీ ముంబైలో 50 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన నీతా అంబానీ ధరించిన చీరపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే? ఆమె ధరించిన ఎరుపు రంగు చీరపై బంగారు వర్ణంలో పవిత్ర గాయత్రి మంత్రాన్ని ముద్రించారు. గాయత్రి మంత్రంతో పాటు మరిన్ని వివరాలను పొందుపరిచారు.

News July 3, 2024

పీఎం కిసాన్ ద్వారా రూ.3లక్షల కోట్లు పంపిణీ: మోదీ

image

దేశ అభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకెళ్తామని రాజ్యసభలో పీఎం మోదీ తెలిపారు. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, పంటల కనీస మద్దతు ధరలు భారీగా పెంచామని చెప్పారు. అన్నదాతల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, పీఎం కిసాన్ ద్వారా ఆరేళ్లలో రూ.3లక్షల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. గతంలో సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తేలేదని పీఎం విమర్శించారు.

News July 3, 2024

ఈ బెదిరింపులకు భయపడేది లేదు: KTR

image

TG: ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై <<13555474>>కేసు<<>> పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. జడ్పీ భేటీలో కలెక్టర్ స్పందించట్లేదని MLA నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాప్రతినిధికి ఆ హక్కు లేదా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై కేసు దుర్మార్గపు చర్య అని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

News July 3, 2024

అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో జరిగిన విధ్వంసం, తాజా పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. అమరావతిపై భవిష్యత్ కార్యాచరణను కూడా సీఎం వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి 7.30 గంటలకు CM ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.

News July 3, 2024

మెరుగైన జీవితానికి 80/20 సూత్రం: గోయెంకా

image

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా జీవితంలో సక్సెస్ అయ్యేందుకు 80/20 సూత్రాన్ని పాటించాలని సూచించారు. ‘ఆరోగ్యం కోసం 80% ఆహారం, 20% వ్యాయామంపై దృష్టి పెట్టండి. బెటర్ కమ్యూనికేషన్ కోసం 80% వింటే 20% మాత్రమే మాట్లాడండి. 80% అర్థం చేసుకోవడం, 20% చదువుకోవడం ద్వారా పలు విషయాలను నేర్చుకోండి. విజయం పొందాలంటే 20% ప్లానింగ్ ఉంటే 80% పనిచేయాలి. బలమైన సంబంధాల కోసం 80% ఇస్తే 20 % మాత్రమే ఆశించండి’ అని తెలిపారు.

News July 3, 2024

రాజ్యసభలో విపక్షాల ఆందోళన.. వాకౌట్

image

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ‘ప్రధాని అబద్ధాలు ఆపాలి, నీట్‌పై చర్చ చేపట్టాలి’ అని నినాదాలు చేశారు. చివరికి వారంతా మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా నిన్న లోక్‌సభలోనూ ప్రధాని ప్రసంగం సందర్భంగా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.

News July 3, 2024

హాథ్రస్ ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలి: ఖర్గే

image

యూపీ హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి ప్రకటన విడుదల చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నకిలీ బాబాలను నియంత్రించాలని కోరారు. సత్సంగ్ లాంటి కార్యక్రమాలకు మార్గదర్శకాలు, ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై రాజ్యసభ సభ్యులు సంతాపం తెలియజేశారు.

News July 3, 2024

ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్

image

AP: కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తుఫాన్ పరిస్థితులపై ఫొటో గ్యాలరీని పరిశీలించారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News July 3, 2024

మరోసారి సీఎంగా హేమంత్ సోరెన్: ఝార్ఖండ్ మంత్రి

image

ఇవాళ ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్‌ మరోసారి సీఎంగా ఎన్నికవడం ఖాయమని మంత్రి సత్యానంద్ భోక్తా తెలిపారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేలంతా నాయకుడిగా ఎన్నుకుంటారని చెప్పారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ రాజీనామా చేస్తారన్నారు. ఆ తర్వాత నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను కూడా కొత్త మంత్రివర్గంలో ఉంటానని తెలిపారు.

News July 3, 2024

పట్టాలెక్కిన రెండో లైను.. 3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుం’టూరు’

image

సికింద్రాబాద్-గుంటూరు రూట్‌లో నల్లపాడు-BBనగర్ మధ్య 248KM మేర 2వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. ₹2853కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి. పూర్తైతే 3 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ప్రస్తుతం సింగిల్ లైన్ వల్ల ఒక రైలు వస్తుంటే మరొకటి స్టేషన్‌లో ఆగాల్సి వస్తోంది. 140% సామర్థ్యంతో ఈ రూట్‌లో రైళ్లు నడుస్తున్నాయి.