News July 2, 2024

ప్రభాస్ ‘రాజాసాబ్’ స్టోరీలైన్ వైరల్..!

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రానున్న సినిమా ‘రాజాసాబ్’. కొన్ని దుష్టశక్తుల వల్ల ఎదురయ్యే కష్టాలను ఓ ప్రేమజంట ఎలా ఎదుర్కొంది అన్నదే స్టోరీ లైన్ అంటూ IMDB వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో కథ అది కాదంటూ మారుతి సన్నిహితుడు, సినీనిర్మాత SKN పరోక్షంగా స్పష్టతనిచ్చారు. ‘ఐఎండీబీ టీం చాలా తెలివైంది. రాధేశ్యామ్ కథను ఈ సినిమాకు కాపీ చేసింది. సిల్లీ ఫెలో’ అంటూ పోస్ట్ పెట్టారు.

News July 2, 2024

ఆదిత్య-L1 మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసింది: ISRO

image

ఆదిత్య-L1 స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడు, భూమికి మధ్య ఉన్న లాగ్రాంజ్ పాయింట్(L1) చుట్టూ మొదటి హాలో కక్ష్యను పూర్తి చేసిందని ఇస్రో ప్రకటించింది. 2024, జనవరి 6న దీనిని కక్ష్యలో ప్రవేశపెట్టగా, పూర్తి చేసేందుకు 178 రోజులు పట్టిందని తెలిపింది. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు గాను గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య-L1ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

News July 2, 2024

భేటీకి సిద్ధం.. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ

image

విభజన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. విభజన హామీలపై చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ.. ఈ నెల 6న సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీకి సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాసిన లేఖను తాను చదివానని.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఏపీలో కూటమి విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు.

News July 2, 2024

నియోజకవర్గాల సంఖ్య 160కు పెరిగే అవకాశం: కేసీఆర్

image

వచ్చే ఎన్నికల్లో తాము బీ-ఫామ్ ఇచ్చిన ప్రతి నేత గెలుస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. ‘పవర్‌లో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన నాయకులు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గాల సంఖ్య 160కు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. వీలైనంత త్వరలో పార్టీలో అన్ని స్థాయుల్లో కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తాం. సోషల్ మీడియాలోనూ మరింత విస్తరిస్తాం’ అని స్పష్టం చేశారు.

News July 2, 2024

రీఛార్జ్ భారం తగ్గాలంటే ఇలా చేయండి!

image

Jio, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ పెంపుతో యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. అయితే పెరిగిన ధరల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే ఈ ఒక్కరోజు అందుబాటులో ఉండే పాత ధరలతో లాంగ్‌టర్మ్(ఏడాది) రీఛార్జ్ చేసుకోండి. ఈ మూడు కంపెనీల్లో రూ.2,545 నుంచి రూ.3,099 మధ్య ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. లేకపోతే పెరిగిన టారిఫ్‌తో ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.

News July 2, 2024

15 ఏళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్

image

TG: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 15 ఏళ్లపాటు పవర్‌లో కొనసాగుతామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో పార్టీ ZP ఛైర్‌పర్సన్స్‌తో ఆయన మాట్లాడారు. ‘మనం అధికారంలోకి వచ్చాక YSR పథకాలైన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పేర్లు మార్చకుండా కొనసాగించాం. కానీ నేడు కొందరు కేసీఆర్ జాడల్నే తుడిచేయాలనుకుంటున్నారు. అంటే తెలంగాణనే తొలగిస్తారా?’ అని ప్రశ్నించారు.

News July 2, 2024

రోహిత్‌కు ఆ అవార్డు ఇవ్వాల్సిందేనంటోన్న ఫ్యాన్స్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024’ అవార్డును ఇవ్వాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 2024లో ఇప్పటివరకు రోహిత్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటున్నారు. ‘టీ20 వరల్డ్ కప్ గెలుపొందడంలో కెప్టెన్‌గా రోహిత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. WCలో అత్యధిక రన్స్ చేసిన 2వ ఆటగాడు. ICC నిష్పక్షపాతంగా ఉంటే ఆయనకు ఈ అవార్డు వస్తుంది’ అని చెబుతున్నారు.

News July 2, 2024

రేపు రాత్రి ఢిల్లీకి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు సహా పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగే కేటాయింపుల ప్రతిపాదనలపైనా సీఎం మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News July 2, 2024

పిన్నెల్లిని పరామర్శించనున్న జగన్

image

AP: ఈ నెల 4న మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కాగా టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News July 2, 2024

కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించండి: AIRTELకు NCDRC ఆదేశం

image

డూప్లికేట్ సిమ్‌ను జారీ చేసినందుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని AIRTELను NCDRC ఆదేశించింది. ఓ ఆర్మీ ఉద్యోగి మొబైల్ నంబర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మోసపూరితంగా సిమ్ కార్డు పొంది అతని బ్యాంకు అకౌంట్ నుంచి 2017లో ₹2,87,630 డ్రా చేశాడు. దీనిపై కంప్లైంట్ ఇవ్వగా నిందితుడిని గుర్తించడంలో కంపెనీ విఫలమైందని కమిషన్ తేల్చింది. ఫిర్యాదుదారు శ్యామ్ కుమార్‌కు ₹2.8 లక్షలతో పాటు ₹లక్ష పరిహారం చెల్లించాలంది.