News July 2, 2024
కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించండి: AIRTELకు NCDRC ఆదేశం
డూప్లికేట్ సిమ్‌ను జారీ చేసినందుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని AIRTELను NCDRC ఆదేశించింది. ఓ ఆర్మీ ఉద్యోగి మొబైల్ నంబర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మోసపూరితంగా సిమ్ కార్డు పొంది అతని బ్యాంకు అకౌంట్ నుంచి 2017లో ₹2,87,630 డ్రా చేశాడు. దీనిపై కంప్లైంట్ ఇవ్వగా నిందితుడిని గుర్తించడంలో కంపెనీ విఫలమైందని కమిషన్ తేల్చింది. ఫిర్యాదుదారు శ్యామ్ కుమార్‌కు ₹2.8 లక్షలతో పాటు ₹లక్ష పరిహారం చెల్లించాలంది.
Similar News
News October 12, 2024
DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్‌కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
News October 12, 2024
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
News October 12, 2024
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.