News June 29, 2024

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్

image

TG: హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ పర్యటనలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ అభివృద్ధికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని, హైవేలను కనెక్ట్ చేస్తూ వరంగల్ ORR ఉండాలన్నారు. డ్రైనేజీ అభివృద్ధితో పాటు నాలాలు అక్రమణకు గురికాకుండా చూడాలని సూచించారు.

News June 29, 2024

బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ ఇండియా

image

మరికాసేపట్లో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత జట్టు 17 ఏళ్లకు మరోసారి ఈ ట్రోఫీని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మైదానంలో ప్లేయర్లు నైపుణ్యాన్ని, స్ఫూర్తిని ప్రదర్శించి మ్యాచులో గెలిచి కప్పును ఇంటికి(భారత్‌) తీసుకురావాలని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ ఆర్మీకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు.

News June 29, 2024

ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు!

image

AP: సీఎం చంద్రబాబు స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో ఓ సీఎం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జులై 1నుంచి రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేయాలని CBN ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పంపిణీ చేసేలా సర్దుబాటు చేయాలన్నారు.

News June 29, 2024

రేపటి నుంచి పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన

image

AP ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రేపట్నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది కట్టాలా? కాఫర్ డ్యామ్‌లు, గైడ్‌బండ్‌లపై ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై నిపుణుల బృందం ఏం చెబుతుందనేది ఆసక్తిగా మారింది.

News June 29, 2024

8న బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం: పురందీశ్వరి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు 10వేలకుపైగా శక్తి కేంద్రాల్లో ‘మన్ కీ బాత్’ నిర్వహించాలని బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి ఆ పార్టీ నేతలకు సూచించారు. ఆయా సెంటర్లలో మోదీ ప్రసంగం వినేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజమండ్రి వేదికగా జులై 8న బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ భేటీలో పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

News June 29, 2024

SBI కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. SBIలోని మరో ఇద్దరు ఎండీలు అశ్వినీ కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లనూ పరిశీలించిన కేంద్రం చివరికి శెట్టిని ఖరారు చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా స్థానాన్ని శ్రీనివాసులు భర్తీ చేయనున్నారు. కాగా శ్రీనివాసులు శెట్టికి SBIలో 36ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.

News June 29, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

image

‘జై బోలో తెలంగాణ’ ఫేమ్ మీరా నందన్ తన ప్రియుడు శ్రీజును పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఇవాళ ఈ వేడుక జరిగింది. 2008లో ముల్లా సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. తెలుగులో హితుడు, ఫోర్త్ డిగ్రీ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గానూ రాణించారు.

News June 29, 2024

బీజేపీకి ప్రజలే సమాధానం చెప్తారు: హేమంత్ సోరెన్

image

ఈ ఏడాది చివర్లో జరిగే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెప్తారని మాజీ CM <<13524683>>హేమంత్<<>> సోరెన్ అన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో తనను బీజేపీ అరెస్ట్ చేయించిందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన అరెస్టు ఆదివాసీలు, పేదవారు, రైతులను అణచివేయడమేనని తెలిపారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయమై తర్వాత ఆలోచన చేస్తానన్నారు.

News June 29, 2024

పోలవరం విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీలే కారణం: షర్మిల

image

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి BJP, TDP, YCPలే కారణమని APCC చీఫ్ షర్మిల Xలో విమర్శించారు. ‘మోదీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. ప్రాజెక్టును తానే కడతానని CBN హడావుడి చేశారు తప్ప ఫలితం శూన్యం. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచారు. ఇప్పుడు మోదీ పిలక CBN చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేయాలి’ అని డిమాండ్ చేశారు.

News June 29, 2024

జుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజుల విచారణ అనంతరం ఇవాళ సీబీఐ అధికారులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు జులై 12 వరకు రిమాండ్ విధించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను ఈడీ అధికారులు మార్చిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.