News June 29, 2024

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్

image

బిహార్‌కు ప్రత్యేక హోదా/ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ JDU జాతీయ కార్యవర్గం తీర్మానించింది. NDA ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నితీశ్ కుమార్ NDAతోనే ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాగా ఎంపీ సంజయ్ ఝాను తమ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ ఎన్నుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఈ సమావేశంలో తీర్మానం చేశారు.

News June 29, 2024

1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తొలిరోజు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన MLAలు, MPలతో భేటీ కానున్నారు. 3న ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు.

News June 29, 2024

భారత్‌కు ప్రపంచ బ్యాంక్ $1.5బిలియన్ల సాయం

image

పునరుత్పాదక శక్తిని విస్తరించేందుకు ప్రపంచ బ్యాంక్ భారత్‌కు $1.5 బిలియన్ల నిధులు కేటాయించింది. ఈ నిధులను పునరుత్పాదక శక్తి సహా గ్రీన్ హైడ్రోజన్‌ మార్కెట్‌ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. కార్బన్ ఎమిషన్స్ జీరో చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్‌కు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపింది. కాగా 2023 జూన్‌లోనూ ప్రపంచ బ్యాంక్ భారత్‌కు ఇదే తరహాలో $1.5B అందించింది.

News June 29, 2024

T20 WC: ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుదే విజయం?

image

T20WC ఫైనల్‌ మ్యాచ్ బార్బోడస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరగనుంది. T20 చరిత్రలో ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 50మ్యాచులు జరగగా, 31మ్యాచుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ల యావరేజ్ 138, సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ల సగటు 125గా ఉంది. అత్యధిక స్కోరు 224/5, అత్యల్ప స్కోరు 43గా నమోదైంది. ఛేదించిన అత్యధిక స్కోర్ 172/6 కాగా, డిఫెండ్ చేసుకున్న లోయెస్ట్ స్కోర్ 106/8గా ఉంది.

News June 29, 2024

రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో ధ్వంసమైన పైకప్పు

image

ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఓ క్యాబ్ డ్రైవర్ మృతిచెందిన దుర్ఘటన మరువక ముందే అదే తరహా ఘటన మరోటి వెలుగుచూసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న పైకప్పు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌‌లోనూ విమానాశ్రయం పైకప్పు భారీ వర్షాలకు ధ్వంసమైంది.

News June 29, 2024

అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం 1,575 ఎకరాలు

image

AP: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్‌ను నిర్మించనుంది. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం మొదలవగా, మిగతా వాటిపై ప్రభుత్వం దృష్టిసారించనుంది.

News June 29, 2024

మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమే!

image

మహిళల హక్కులు, వారి గౌరవాన్ని పరిరక్షించడానికి కొత్త క్రిమినల్ చట్టాలలో కఠినమైన నిబంధనలు చేర్చినట్లు PIB పేర్కొంది. ఇకపై తప్పుడు వాగ్దానాలతో మహిళను లోబరుచుకొని ఆమెతో లైంగిక సంబంధాలను పెట్టుకోవడం నేరం. దోషులకు కఠిన శిక్షలు తప్పవని వెల్లడించింది. జులై 1 నుంచే కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.

News June 29, 2024

రోహిత్ స్థానంలో నేనుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వను: సెహ్వాగ్

image

రోహిత్ శర్మ స్థానంలో తాను ఉంటే ఇంజమామ్ బాల్ టాంపరింగ్ <<13517621>>ఆరోపణలపై<<>> స్పందించేవాడిని కాదని సెహ్వాగ్ తెలిపారు. ‘ప్లేయర్లను రిపోర్టర్లు ఇలాంటి ప్రశ్నలు అడగటం తప్పు. ఎవరో చేసిన ఆరోపణలపై ఆటగాళ్ల అభిప్రాయాన్ని అడగొద్దు. వారు తమ సొంత ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఇలాంటి ప్రశ్నలు ఆటగాళ్లకు ఏమాత్రం ఉపయోగపడవు. వివాదాలు సృష్టించేందుకు మాత్రమే పనికొస్తాయి’ అని క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News June 29, 2024

కలెక్షన్లలో దుమ్మురేపుతున్న ‘కల్కి2898AD’

image

ప్రభాస్ నటించిన ‘కల్కి2898AD’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండోరోజు(శుక్రవారం) ఈ మూవీ రూ.107 కోట్లు వసూలు చేసినట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. దీంతో 2 రోజుల్లో మొత్తం రూ.298.5 కోట్లు సాధించింది. శని, ఆదివారం వీకెండ్స్ కావడంతో వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో 2 రోజుల్లో ఈ సినిమా ఈజీగా రూ.550 కోట్లు దాటేస్తుందని టాక్.

News June 29, 2024

ప్రధాని మోదీకి వివాహ ఆహ్వానం అందించిన వరలక్ష్మి

image

నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం జులై 2న థాయ్‌లాండ్‌లో జరగనుంది. ఈక్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్‌కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతోపాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయనను ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తమకు టైమ్ ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు.