News June 29, 2024

టీ20 WC చరిత్రలో ఒక్కసారీ అలా జరగలేదు!

image

టీ20 WC చరిత్రలో ఇప్పటివరకూ ఫైనల్ ఆడిన జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడలేదు. ప్రతీ ఎడిషన్‌లో కొత్త ప్రత్యర్థులే ఎదురుపడ్డారు. భారత్VSపాక్ (2007), పాక్VSశ్రీలంక (2009), ఇంగ్లండ్VSఆసీస్ (2010), వెస్టిండీస్VSశ్రీలంక (2012), శ్రీలంకVSభారత్ (2014), వెస్టిండీస్VSఇంగ్లండ్ (2016), ఆస్ట్రేలియాVSన్యూజిలాండ్ (2021), ఇంగ్లండ్VSపాక్(2022), సౌతాఫ్రికాVSఇండియా (2024) ఫైనల్ చేరాయి.

News June 29, 2024

‘RRR’కు రూట్ క్లియర్!

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఒకేసారి ఉత్తర, దక్షిణ భాగాల(350.76KM) పనులు చేపట్టడమే ఉత్తమమన్న కేంద్రమంత్రి గడ్కరీ సూచనకు CM రేవంత్ అంగీకరించారు. దీంతో భూసేకరణ ప్రక్రియ ఊపందుకోనుంది. నిర్మాణంలో భాగంగా తీగలు, స్తంభాలు, పైప్‌లైన్ల తరలింపు కోసం కేంద్రమే రూ.300Cr ఇస్తుందని మంత్రి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ఇదేవిషయమై సందిగ్ధత నెలకొంది.

News June 29, 2024

ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం.. మహిళా సంఘాలకు కేటాయింపు

image

TG: ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని కేటాయించనుంది. ఇందుకోసం రూ.2.50 లక్షల రుణాన్ని వారికి అందించనుంది. ఇంటర్ పాసైన మహిళలను మీసేవ ఆపరేటర్లుగా ఎంపిక చేయనుంది. వారికి నెలపాటు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15లోగా ప్రారంభించనుంది. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల, ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

News June 29, 2024

ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్న జగన్?

image

AP: ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని పార్టీ నేతలతో మాజీ CM జగన్ అన్నట్లు తెలిసింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పినట్లు సమాచారం. ‘ఫలితాల షాక్‌లోంచి బయటకు రావడానికి నాకు 2, 3 రోజులు పట్టింది. 40 శాతం ఓట్లు అంటే పెద్ద సంఖ్యలో జనం మన వెంటే ఉన్నారు. వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా. అందుకే మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యా’ అని అన్నట్లు వార్తలొస్తున్నాయి.

News June 29, 2024

మరో వెబ్ సిరీస్‌లో నటించనున్న సమంత?

image

హీరోయిన్ సమంత మరో వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్&డీకే తెరకెక్కించనున్న ఈ సిరీస్‌లో ఆమెతో కలిసి బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి ‘రక్తబీజ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సామ్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

News June 29, 2024

డీఎస్.. రాజకీయ ఉద్దండుడు

image

TG: డీఎస్‌ పేరుతో రాజకీయాల్లో ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి <<13529338>>డి.శ్రీనివాస్<<>>.. NSUI ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేశారు. 1989, 1999, 2004లో MLAగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన CM రేసులో నిలిచినా చివరికి ఆ పదవి YSRకు దక్కింది. ఇక 2014 తర్వాత BRSలో చేరిన ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.

News June 29, 2024

రూ.2,00,000 రుణమాఫీపై CM రేవంత్ కీలక ప్రకటన

image

TG: రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని, మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని సీఎం వివరించారు.

News June 29, 2024

జిల్లాల కుదింపుపై స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్

image

TG: జిల్లాల సంఖ్యను కుదిస్తామని తానెప్పుడూ చెప్పలేదని CM రేవంత్ అన్నారు. వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో జనాభా పరంగా భారీ తేడా ఉందని, అందుకే వాటిని హేతుబద్ధీకరించాలని తెలిపారు. జిల్లాలు, మండలాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయం తీసుకుంటామని ఢిల్లీలో మాట్లాడారు.

News June 29, 2024

ఐదేళ్లలో 65 ఎగ్జామ్ పేపర్ల లీకులు..!

image

ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 65 ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. అత్యధికంగా UPలో 8 ఎగ్జామ్ పేపర్లు లీక్ చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ (7), బిహార్ (6), గుజరాత్, మధ్యప్రదేశ్ (4), హరియాణా, కర్ణాటక, ఒడిశా, బెంగాల్ (3), తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్ (2), జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఝార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నాపత్రం లీకైంది. కాగా ఏపీలో మాత్రం ఒక్కసారి కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ కాలేదు.

News June 29, 2024

BREAKING: డి.శ్రీనివాస్ కన్నుమూత

image

TG: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు.