News June 28, 2024

సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు.. ప్రభాస్ సరికొత్త రికార్డు

image

కల్కి 2898ADతో మరో సూపర్ హిట్ సాధించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా డార్లింగ్ నిలిచారు. బాహుబలి-2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, సలార్ రూ.178 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సాహో రూ.130 కోట్లు తొలిరోజే వసూలు చేశాయి.

News June 28, 2024

కేసీఆర్‌తో కార్యకర్తల భేటీకి 3 రోజులు బ్రేక్

image

TG: కేసీఆర్ గత 15 రోజులుగా ఎర్రవెల్లిలో నిరంతరాయంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఆయనతో ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పార్టీ నేతలతో కీలక సమావేశాలున్న నేపథ్యంలో పార్టీ నుంచి మరో ప్రకటన వచ్చే వరకూ ఎవరూ తనను కలవడానికి రావొద్దని కేసీఆర్ కోరారని పేర్కొంది.

News June 28, 2024

విద్యార్థులకు శుభవార్త.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

image

AP: విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘ఈ పథకాలకు YCP ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం తొలగించి.. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని ఆయన వెల్లడించారు.

News June 28, 2024

టీచర్లు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిందే: సుప్రీంకోర్టు

image

దేశ నిర్మాణంలో కీలకమైన టీచర్లు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇష్టంలేనివారు ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలంది. బిహార్‌లో స్థానిక సంస్థల ద్వారా 4 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరికి స్కూల్ టీచర్ల హోదా కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తుండగా, దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. పరీక్ష రాయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

News June 28, 2024

టాప్-3లో మంగళగిరి ఎయిమ్స్ ఉండేలా చర్యలు: చంద్రబాబు

image

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మధబానంద కర్ సమస్యలను ఏకరవుపెట్టారు. ఐదేళ్లుగా నీటి సమస్యను ప్రభుత్వం తీర్చకపోవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ను టాప్-3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని, పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అటు AIIMSలో పర్యటించి, సౌకర్యాలు పరిశీలించాలని CMను డైరెక్టర్ కోరారు.

News June 28, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌ ‘గ్రూప్ చాట్ ఈవెంట్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూప్‌లలోని సభ్యులు ఈవెంట్స్‌ను క్రియేట్ చేసి ఇతరులను ఆహ్వానించవచ్చు. ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచవచ్చు. దీని వివరాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. తొలుత కమ్యూనిటీ గ్రూప్‌లకోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు సాధారణ గ్రూప్‌లకూ విస్తరించారు. ఇది యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి రానుంది.

News June 28, 2024

త్వరలో ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి

image

AP, TG CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. జులై 3వ వారంలో HYDలోని HICCలో జరిగే ప్రపంచ కమ్మ మహాసభ కార్యక్రమంలో CMలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో TDPలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ CM అయ్యారు. చాలాకాలం తర్వాత ఇరువురిని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 28, 2024

స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు యథాతథం

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబర్)లోనూ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, PPFపై 7.1%, సేవింగ్స్ డిపాజిట్‌పై 4%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7%, మంత్లీ ఇన్‌కం స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది.

News June 28, 2024

‘కల్కి’.. విజువల్ వండర్: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ కుటుంబసమేతంగా చూసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ నాగ్‌అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. లెజెండరీ నటులు అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన మూవీ విజువల్ వండర్ అని ట్వీట్ చేశారు. సినిమాలు విజయవంతం అయితేనే లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, ప్రతిఒక్కరూ ఈ మూవీ చూడాలని కోరారు.

News June 28, 2024

ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే?

image

భారత్-సౌతాఫ్రికా మధ్య రేపు రా.8 గంటలకు ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ జరిగే బ్రిడ్జ్‌టౌన్‌లో రేపు వర్షం పడే అవకాశం 70% ఉన్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేదు. ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంటుంది. శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం నిర్వహిస్తారు. ఆరోజు కూడా వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే IND, SAను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక ఫైనల్‌కు గఫానీ, ఇల్లింగ్‌వర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.