News June 28, 2024
టాప్-3లో మంగళగిరి ఎయిమ్స్ ఉండేలా చర్యలు: చంద్రబాబు
AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మధబానంద కర్ సమస్యలను ఏకరవుపెట్టారు. ఐదేళ్లుగా నీటి సమస్యను ప్రభుత్వం తీర్చకపోవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ను టాప్-3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని, పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అటు AIIMSలో పర్యటించి, సౌకర్యాలు పరిశీలించాలని CMను డైరెక్టర్ కోరారు.
Similar News
News October 14, 2024
గుజరాత్‌లో రూ.5వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఇటీవల దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 700కిలోలకు పైగా కొకెయిన్ పట్టుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని అంకలేశ్వర్ సిటీలో ఉన్న ఆవ్‌కార్ డ్రగ్స్ సంస్థ పేరును నిందితులు చెప్పినట్లు సమాచారం. గుజరాత్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సంస్థపై దాడులు చేశామని, రూ.5వేల కోట్ల విలువైన 518 కిలోల కొకెయిన్‌ను పట్టుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
News October 14, 2024
పూరీ ఆలయంలో భక్తులకు ఉచిత ప్రసాదం?
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఇకపై భక్తులకు ఉచిత ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏటా రూ.14 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉచిత ప్రసాదం కోసం కొందరు దాతలు విరాళాలు ఇస్తున్నారని, మరికొందరు కూడా ముందుకు రావాలని సర్కార్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
News October 14, 2024
జూరాల 5 గేట్లు ఎత్తివేత
కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. దిగువకు వదిలిన నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది.