News June 28, 2024

టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన భారత్

image

టెస్ట్ క్రికెట్‌లో ఒకరోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాతో టెస్టులో మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి 525/4 రన్స్ చేసింది. పురుషులు, మహిళల టెస్ట్ క్రికెట్‌లో ఒకరోజులో ఇదే అత్యధిక స్కోర్. 2002లో బంగ్లాపై లంక 509/9 రన్స్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో షెఫాలీ 205, స్మృతి మందాన 149 రన్స్‌తో చెలరేగారు. జెమీమా 55 చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం క్రీజులో హర్మన్ 42*, రిచా 43* ఉన్నారు.

News June 28, 2024

సీఎంకు 986 మందితో భద్రత అవసరమా?: చంద్రబాబు

image

AP: రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. ‘జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలి. జగన్‌కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు సీఎంకు అంత భద్రత అవసరమా? ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పా. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా’ అని పేర్కొన్నారు.

News June 28, 2024

జోరుకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

ఈరోజు సెషన్‌ ఆరంభంలో ఉన్న జోరును దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి వరకు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 79,032 (-210 పాయింట్లు), నిఫ్టీ 24,010 (-33) వద్ద ముగిశాయి. ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ICICI వంటి బడా షేర్ల నష్టాలు ప్రభావం చూపాయి. మార్కెట్లో స్టాక్స్ విలువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు. దీనిని దేశీయ ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతోందంటున్నారు.

News June 28, 2024

NEET రద్దుపై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

image

NEETను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. నీట్‌కు వ్యతిరేకంగా DMK పోరాటం కొనసాగుతుందని, ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలని CM స్టాలిన్ అన్నారు. చర్చ సందర్భంగా BJP MLA నాగేంద్రన్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. NEETను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.

News June 28, 2024

బైడెన్‌పై అసంతృప్తి… ఇప్పుడు అభ్యర్థిని మార్చొచ్చా?

image

డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌లో US అధ్యక్షుడు జో బైడెన్ ప్రదర్శనపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న వేళ ఆయన అభ్యర్థిత్వం చర్చనీయాంశమైంది. బైడెన్ స్వయంగా తప్పుకుంటే తప్ప మార్పు దాదాపు అసాధ్యమనేది విశ్లేషకుల మాట. ట్రంప్‌కూ ఇదే వర్తిస్తుందంటున్నారు. ఇద్దరికీ వారి పార్టీల్లోని డెలిగేట్స్ మద్దతు ఉండటమే కారణం. త్వరలో సంబంధిత కన్వెన్షన్లలో పార్టీలు వీరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నాయి.

News June 28, 2024

IVF ద్వారానే కవలల్ని కన్నా: అంబానీ కూతురు

image

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ IVF ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మా అమ్మ నీతా అంబానీకి నేను, ఆకాశ్ పుట్టినట్లే నాకూ కవలలు పుట్టారు. పిల్లలను కనేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఎందుకు ఉపయోగించవద్దు? దీనిలో తప్పులేదు. మీరు దాచాల్సిన అవసరం కూడా లేదు’ అని ఆమె చెప్పారు.

News June 28, 2024

‘కల్కి’ కోసం అడగ్గానే ఓకే చెప్పా: మృణాల్

image

‘కల్కి 2898ఏడీ’ సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేశా’ అని పేర్కొన్నారు. నిన్న విడుదలైన ‘కల్కి 2898ఏడీ’ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

News June 28, 2024

అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: పోలవరం ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పనిగా మారిందని CM చంద్రబాబు చెప్పారు. తాము పడిన శ్రమను జగన్ వృథా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తున్నామని, వారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేయొచ్చో నిపుణులే చెప్పాల్సి ఉందన్నారు. ఇటీవల ప్రాజెక్టును చూసి కళ్ల వెంట నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

News June 28, 2024

సప్లిమెంటరీ ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్

image

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 73.03శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఇందులో బాలికలు 76.37శాతం, బాలురు 71.01శాతం పాసయ్యారు. నిర్మల్ జిల్లా 100శాతం ఉత్తీర్ణత సాధించి ఫస్ట్ ప్లేస్‌, 42.12శాతం పర్సంటేజ్‌తో వికారాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. రీకౌంటింగ్ కావాలనుకునే విద్యార్థులు జులై 8లోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలని అధికారులు తెలిపారు.

News June 28, 2024

‘మోదీ 3.0’కి ఎగువసభలో అంత ఈజీ కాదు!

image

NDA పార్టీల మద్దతుతో BJP మళ్లీ అధికారం చేపట్టినా దానికి ఎగువసభ (రాజ్యసభ)లో మాత్రం ఇప్పటికీ మెజారిటీ లేదు. ప్రస్తుతం 121 MPలున్న పార్టీకి మెజారిటీ ఉన్నట్లు. అయితే NDAకు లేదా BJPకి ఆ మెజారిటీ లేదు. NDAకు 118 మంది మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న BJD, BRS, AIADMK వంటి ప్రాంతీయ పార్టీలు BJPకి బిల్లులకు సపోర్ట్ చేస్తాయా? అనేది ఆసక్తికరం. చేయకపోతే బిల్లుల ఆమోదానికి మోదీ 3.0 చెమటోడ్చాల్సిందే.