News June 28, 2024

ఆ ఒక్క ట్రిక్ వికెట్లు పడేలా చేసింది: అక్షర్

image

ఇంగ్లండ్‌తో T20 WC సెమీస్ మ్యాచ్‌లో పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ చేయడం వల్లే వికెట్లు తీయగలిగానని అక్షర్ పటేల్ తెలిపారు. ‘పిచ్ చాలా మందకొడిగా ఉంది. బంతి అస్సలు పైకి లేవడం లేదని మా బ్యాటర్లు చెప్పారు. దీంతో తక్కువ వేగంతో బౌలింగ్ వేశా. దీంతో వికెట్లు దక్కాయి’ అని చెప్పారు. కాగా ఈ మ్యాచ్‌లో అక్షర్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు. అతడినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.

News June 28, 2024

ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే.. కానీ: MP శశిథరూర్

image

ఐదు దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కానీ రాజ్యంగ విరుద్ధం కాదన్నారు కాంగ్రెస్ MP శశిథరూర్. ‘ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతల అరెస్టులు, మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే. అయితే రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఎమర్జెన్సీ అంశాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని, రాష్ట్రపతి, స్పీకర్ లోక్‌సభలో ప్రస్తావించడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

News June 28, 2024

భారీగా తగ్గిన టమాటా ధర!

image

కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న టమాటా ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ రూ.50 నుంచి రూ.60 మధ్య విక్రయిస్తున్నారు. రెండు వారాలుగా కేజీ రూ.100 వరకు పెరిగిన టమాటా.. క్రమంగా దిగి వస్తోంది. సరఫరా పెరగడంతో రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News June 28, 2024

BREAKING: హేమంత్ సోరెన్‌కు బెయిల్

image

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ల్యాండ్ స్కాం కేసులో ఆయన మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News June 28, 2024

ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై ‘క్రైమ్ ట్యాక్స్’

image

TNలోని వడక్కలూర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి కొన్ని తరాల నుంచి ‘కుట్ర వరీ’(క్రైమ్ ట్యాక్స్) విధిస్తున్నారు. చెల్లించకపోతే గ్రామంలోకి అనుమతి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇంటింటికీ తిరిగి తప్పు చేశానని క్షమాపణలు చెప్పాలి. గ్రామపంచాయతీ వద్ద క్షమాపణ చెప్పి రూ.500 ట్యాక్స్ చెల్లించాలి. కొందరు దీన్ని తప్పుపడుతుంటే ఆ ట్యాక్స్ ఆలయ అభివృద్ధికి వెచ్చిస్తామని, ఇందులో తప్పేం లేదని గ్రామ పెద్దలంటున్నారు.

News June 28, 2024

నేడు పీవీ నరసింహారావు జయంతి

image

తెలంగాణలో జన్మించి దేశ దశాదిశా మార్చిన మహా నాయకుడు పీవీ నరసింహారావు. 1952లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పీవీ.. MLA, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని పదవులను అలంకరించారు. సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న దేశ ఎకానమీని పట్టాలెక్కించారు. పీవీ చొరవతోనే ఎన్నో విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫలాలు నేటి తరం అనుభవిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పీవీని భారతరత్న పురస్కారం వరించింది.

News June 28, 2024

బిహార్‌లో కుప్పకూలిన మరో వారధి

image

బిహార్‌లో బ్రిడ్జిలు వరసగా పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3చోట్ల వారధులు కూలగా కిషన్‌గంజ్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. మదియా నదిపై 2011లో కట్టిన బ్రిడ్జి వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని అరారియా జిల్లాలో 2, సివార్ జిల్లాలో ఓ బ్రిడ్జి కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వారధుల నాణ్యతపై ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

News June 28, 2024

కొత్త పీసీసీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా?

image

TG: కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 4 భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కొత్త పీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం.

News June 28, 2024

పెరిగిన ధరలు.. BSNLకు మారుతామంటోన్న యూజర్లు!

image

సిగ్నల్ సరిగా రాకపోవడం, రీఛార్జ్ ధరలు పెంచేయడంతో జియో యూజర్లు Airtelకు మారుదామనుకున్నారు. తాజాగా Airtel కూడా ధరలు పెంచడంతో యూజర్లు షాక్‌లో ఉన్నారు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో నెట్‌వర్క్ మారిపోవడం బెటర్ అని, 5G తెస్తే ఇంకా మేలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం.

News June 28, 2024

‘నేను రికార్డుల్లో ఉండటం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి’

image

T20WC-2024లో రోహిత్ శర్మ అదరగొడుతున్నారు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తూ జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఈ మెగాటోర్నీలో ఇండియా తరఫున అత్యధిక రన్స్, స్కోర్, స్ట్రైక్ రేట్, ఎక్కువ హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్లు.. ఇలా అన్ని రికార్డులూ తన పేరిట లిఖించుకున్నారు. మరో 33 రన్స్ చేస్తే అఫ్గాన్ ప్లేయర్ గుర్బాజ్‌ను దాటేసి ఈ WCలో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలుస్తారు రోహిత్.