News June 28, 2024

జులై 19న ఓటీటీలోకి ‘మహారాజ’?

image

తమిళ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుందట.

News June 28, 2024

స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోరు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిన్న తొలిసారిగా సెన్సెక్స్ 79వేల మార్క్, నిఫ్టీ 24వేల మార్క్ దాటగా ఈరోజు ఆ జోరును కొనసాగిస్తున్నాయి. 278 పాయింట్ల లాభంతో 79,519 వద్ద దూసుకెళ్తున్న సెన్సెక్స్ ఓ దశలో గరిష్ఠంగా 79,671కు చేరింది. నిఫ్టీ 100కుపైగా పాయింట్లు ఎగిసి 24,145 వద్ద ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డిస్, SBI, ONGC, టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

News June 28, 2024

చెత్త వాగుడొద్దు: వాన్‌పై భజ్జీ ఆగ్రహం

image

T20 WCలో వేదికలు, పిచ్‌లు అన్నీ భారత్‌కు అనుకూలంగా ఉన్నాయంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్‌కు గయానా సరైన వేదిక అని ఎందుకు అనుకుంటున్నారు? రెండు జట్లూ అదే చోట ఆడాయి కదా? ఇంగ్లండ్‌ను భారత్ అన్ని విభాగాల్లోనూ ఓడించిందని ఒప్పుకోండి. లాజిక్‌గా మాట్లాడండి కానీ ఇలా చెత్త వాగుడు వద్దు’ అని సూచించారు.

News June 28, 2024

ఐస్ క్రీమ్‌లోకి ‘వేలు’ ఎలా వచ్చిందంటే?

image

ఇటీవల మహారాష్ట్రలోని ఓ డాక్టర్‌‌కి ఐస్ క్రీమ్‌లో మనిషి వేలు రావడం సంచలనంగా మారింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా తాజాగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వేలు పుణేలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఓంకార్ పొటేదని DNA టెస్టులో తేలింది. అతడు ఐస్ క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మెషీన్‌లో పడి మిడిల్ ఫింగర్ తెగిపోయింది. అది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ద్వారా ఓ డాక్టర్‌కు చేరింది.

News June 28, 2024

T20WCలో టీమ్‌ఇండియాకి ప్రత్యేక రూల్స్: ఇంజమామ్

image

T20WCలో అన్ని జట్లకు ఒక రూల్ ఉంటే భారత్‌కు మాత్రం ప్రత్యేక రూల్స్ ఉన్నాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ మండిపడ్డారు. ‘2వ సెమీఫైనల్ చూస్తేనే అది అర్థమవుతోంది. INDvsENG గేమ్‌కు మాత్రమే రిజర్వు డే లేదు. పైగా టోర్నీ ఆరంభానికి ముందే వారి సెమీస్ వేదిక ఫిక్స్ చేశారు. రిజర్వు డే లేకపోవడంతో వర్షం పడినా భారత్ ఫైనల్‌కు వెళ్లేలా చూసుకున్నారు. ప్రపంచ క్రికెట్‌ను BCCI శాసిస్తోంది’ అని ఆరోపించారు.

News June 28, 2024

సీడ్ యాక్సెస్ రోడ్డు.. భూములిచ్చేందుకు రైతుల సంసిద్ధత

image

AP: రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు తాడేపల్లి మండలం పెనుమాక రైతులు ముందుకొచ్చారు. మొత్తం 3.21 ఎకరాలు సేకరించాల్సి ఉంది. గతంలో భూములిచ్చిన వారికి ఎకరాకు డెవలప్‌మెంట్ ప్లాట్ల కింద 1450 గజాలు ఇచ్చారు. అయితే భూమి ధరల దృష్ట్యా 2000 నుంచి 2400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. దీనిని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.

News June 28, 2024

Airtel రీఛార్జ్ ధరలు పెంపు

image

నిన్న జియో రీఛార్జ్ రేట్లు పెరగ్గా.. తాజాగా Airtel టారిఫ్స్ పెరిగాయి. జులై 3 నుంచి పెంచిన ధరలు దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. రూ.179ను రూ.199కి, రూ.299ను రూ.349కి, రూ.399ని రూ.449కి రూ.455ను రూ.509కి పెంచింది. మొత్తంగా Airtel రీఛార్జ్ ధరలు 10-21% పెరిగాయి.

News June 28, 2024

‘మెరుపు’లా వస్తోన్న కళ్యాణ్ రామ్?

image

నందమూరి కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News June 28, 2024

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీద వేస్తున్నావా?’

image

రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య జియో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదని ఫైరవుతున్నారు.

News June 28, 2024

మేం పొరపాటు చేశాం: బట్లర్

image

T20WC సెమీస్‌లో భారత్‌ చేతిలో ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ స్పందించారు. స్పిన్నర్లు రషీద్, లివింగ్‌స్టోన్ రాణించినా మరో స్పిన్నర్ మొయిన్ అలీతో బౌలింగ్ చేయించకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నారు. కఠినమైన పిచ్‌పై 145-150రన్స్‌కే కట్టడి చేయాలని చూశామని, కానీ భారత్ అంతకంటే ఎక్కువ పరుగులు చేసిందన్నారు. టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిందని, విజయానికి వారు అర్హులని బట్లర్ అన్నారు.