News June 28, 2024

నేడు పోలవరంపై శ్వేతపత్రం!

image

AP: పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను ప్రభుత్వం వివరించనుంది. మధ్యాహ్నం 3గంటలకు అమరావతి సచివాలయంలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం రేపు పోలవరం పరిశీలనకు రానుంది. నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం ప్రభుత్వం పనులు చేపట్టనుంది.

News June 28, 2024

జగన్ చేసిన పాపాల వల్లే వైసీపీకి ఈ దుస్థితి: సీఎం రేవంత్

image

APలో TDPని ఖతం చేయాలనుకుని, జగనే ఖతమయ్యారని తెలంగాణ CM రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రేవంత్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. బాబు ఫోన్ చేస్తే HYDలో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.

News June 28, 2024

నాగ్ అశ్విన్ నటించిన సినిమాలు ఏంటో తెలుసా?

image

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా నాగ్ దర్శకుడిగా మారకముందు కొన్ని సినిమాల్లో నటించారు. నేను మీకు తెలుసా, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో ఆయన కనిపించారు. శేఖర్ కమ్ముల దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మూడు సినిమాలతోనే ఆయన టాప్ డైరెక్టర్‌గా మారిపోయారు.

News June 28, 2024

ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..: రోహిత్ శర్మ

image

మెగా టోర్నీలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మద్దతు తెలిపారు. ‘విరాట్ క్వాలిటీ ప్లేయర్. 15 ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతడికి సమస్యే కాదు. పెద్ద మ్యాచుల్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అతడి ఇంటెంట్ బాగుంది. ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..’ అని నవ్వుతూ చెప్పారు.

News June 28, 2024

లులు మాల్‌లో బూజు పట్టిన బ్రెడ్

image

TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, గడువు ముగిసిన నువ్వుల గింజలు, టోన్డ్ పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ల రసాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటిని బయట పడేశామని చెప్పారు. ఫుడ్ సెక్షన్‌లోని వర్కర్లు మాస్కులు, హెయిర్ క్యాప్స్, గ్లవ్స్ ధరించలేదని పేర్కొన్నారు.

News June 28, 2024

తిరుమలలో విజిలెన్స్ అధికారుల విచారణ

image

AP: తిరుమలలో YCP హయాంలో జరిగిన పనులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ టికెట్ల కేటాయింపు, శ్రీవాణి సేవా టికెట్ల ద్వారా వచ్చిన నిధుల వినియోగం, టెండర్లు, గదుల ఆధునికీకరణ, అగర్బత్తీల తయారీ వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అన్నదానం, లడ్డూ తయారీ విధానాన్నీ పరిశీలించనున్నారు.

News June 28, 2024

TEAM INDIA: ఇంగ్లండ్‌కూ ఇచ్చిపడేసింది!

image

రెండేళ్ల కింద జరిగిన ఘోర పరాభవానికి టీమ్ ఇండియా రివేంజ్ తీర్చుకుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. దీంతో టీమ్ ఇండియా అవమానకరరీతిలో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో భారత ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

News June 28, 2024

KOHLI: తుది పోరులోనైనా మెరుస్తారా?

image

టీ20 WCలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యం చెందుతున్నారు. టోర్నీలో ఇప్పటివరకు ఆయన 75 పరుగులు మాత్రమే చేశారు. కానీ కోహ్లీ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ప్రకటించారు. ఫైనల్‌లో ఆయన నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు తెలిపారు. పొట్టి కప్పు సమరంలో విరాట్ 1, 4, 0, 24, 37, 0, 9 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

News June 28, 2024

UN గాజా ఆకలి సూచీ తప్పు: ఇజ్రాయెల్

image

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన గాజా ఆకలి సూచీ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. అత్యవసరంగా గాజాను ఆదుకోకపోతే అక్కడ కరవు తాండవిస్తుందని ఆ సూచీలో యూఎన్ హెచ్చరించింది. అయితే ఆ సూచీని హమాస్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే రూపొందించారని, ఏమాత్రం నమ్మదగినది కాదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. గాజాకు పూర్తి అనుకూలంగా ఆ నివేదికను తయారు చేశారని ఆరోపించింది.

News June 28, 2024

90 శాతం బిలియనీర్లు అగ్ర కులాల వారే!

image

దేశంలోని దాదాపు 90 శాతం మంది బిలియనీర్లు అగ్ర కులాలకు చెందినవారేనని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదికలో తేలింది. సంపదంతా అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. బిలియనీర్ల జాబితాలో ఎస్టీలు లేరని తెలిపింది. టాప్ 1 శాతం మిలియనీర్ల జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికిపైగా నియంత్రిస్తున్నట్లు పేర్కొంది. 2014-15 నుంచి 2022-23 మధ్య సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు పెరిగాయని తెలిపింది.