News June 27, 2024

కల్కి రిలీజ్.. నాగ్ అశ్విన్ పోస్ట్ చూశారా?

image

కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసేలా అరిగిపోయిన చెప్పుల ఫొటోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గమ్యం కన్నా ప్రయాణమే గొప్పదని అర్థం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీని దాదాపు మూడున్నరేళ్లకు పైగా తెరకెక్కించారు. దీపిక, కమల్ హాసన్, అమితాబ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

News June 27, 2024

ప్రజలు పశువుల్లా ప్రయాణించాల్సి రావడం సిగ్గుచేటు: ముంబై హైకోర్టు

image

ముంబై లోకల్ ట్రైన్లలో <<10655919>>ప్రమాదకర<<>> రీతిలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు పెరగడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలు పశువుల్లా ప్రయాణించాల్సి రావడం సిగ్గుచేటు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఈ దయనీయ పరిస్థితులకు సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులదే బాధ్యత. పరిష్కార మార్గాలపై అఫిడవిట్ దాఖలు చేయండి’ అని ఆదేశించారు.

News June 27, 2024

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 3కి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం, కడియం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 3న విచారిస్తామని కోర్టు తెలిపింది.

News June 27, 2024

‘కల్కి’పై రాజమౌళి కామెంట్స్

image

ఇవాళ థియేటర్లలో విడుదలైన ‘కల్కి’ మూవీపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందని, అద్భుతమైన టేకింగ్‌తో అదరగొట్టారన్నారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని, అమితాబ్, కమల్ హాసన్, దీపిక సపోర్ట్ అద్భుతమని పేర్కొన్నారు. చివరి 30 నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి టీమ్ అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు.

News June 27, 2024

సరికొత్త గరిష్ఠాలతో స్టాక్ మార్కెట్లు క్లోజ్

image

ఈరోజు సెషన్‌లో జోరు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌ను సరికొత్త గరిష్ఠాలతో ముగించాయి. సెన్సెక్స్ ఓ దశలో 79,396కు చేరగా మార్కెట్ ముగిసే సమయానికి 568 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. మరోవైపు 24వేల మార్క్ తాకిన నిఫ్టీ సైతం అదే జోరు కొనసాగించి 175 పాయింట్ల లాభంతో 24,044 వద్ద క్లోజ్ అయింది. ఐటీ, విద్యుత్ రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది.

News June 27, 2024

బురద రాజకీయాల్ని పక్కనపెట్టి హామీలు అమలు చేయండి: YCP

image

AP: YS జగన్‌పై మాజీ సీఎస్ LV చేసిన ఆరోపణల వీడియోను పోస్టు చేసిన <<13518603>>TDPకి<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘రాజధాని పేరుతో వేల ఎకరాలు కొట్టేసి గ్రాఫిక్స్ చూపించే సంస్కృతి మీది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి జగన్ వ్యతిరేకిస్తున్నారు. LV చేత ఈ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు. మీ బురద రాజకీయాల్ని పక్కనపెట్టి హామీల అమలుపై దృష్టిపెట్టండి’ అని Xలో రాసుకొచ్చింది.

News June 27, 2024

రోహిత్ శర్మకు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు: కపిల్ దేవ్

image

టీమ్ ఇండియాలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ దిగ్గజాలేనని, ఒకరితో ఒకరిని పోల్చి చూడొద్దని వారి ఫ్యాన్స్‌కు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. ‘కోహ్లీ ఫిట్‌నెస్ ఇష్టపడతారు. తన వల్ల జట్టులో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగింది. రోహిత్ జిమ్ పెద్దగా ఇష్టపడరు. అయినా ఫిట్‌గానే ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్నారు. ఎవరి శైలి వారిది. రోహిత్‌‌కు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు. ఒక్క ప్యాక్‌ ఉన్నా సిక్సులు కొడతారు’ అని పేర్కొన్నారు.

News June 27, 2024

నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి అవసరం లేదు: నవాజుద్దీన్ సిద్దిఖీ

image

పెళ్లితో సంతోషం వస్తుందని మనం భావిస్తామని, కానీ కొన్ని రోజులకు చేసే పని మాత్రమే ఆనందాన్నిస్తుందని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మీరు నిజంగా ప్రేమలో ఉంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వివాహం తర్వాత ఒకరినొకరు తేలిగ్గా తీసుకుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోతుంది’ అని పేర్కొన్నారు. భార్య ఆలియాతో గొడవల తర్వాత ఇప్పుడు వారు కలిసిపోయిన విషయం తెలిసిందే.

News June 27, 2024

బైజూస్ మాకు ₹13 కోట్లు బాకీ ఉంది: ఒప్పో

image

తమ ఫోన్లలో బైజూస్ యాప్ ప్రీఇన్‌స్టాల్ చేసినందుకు ఆ సంస్థ తమకు ₹13కోట్లు బాకీ ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌కు ఒప్పో తెలియజేసింది. బైజూస్ ప్రమోటర్లు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. కాగా విచారణను జులై 3కు వాయిదా వేసిన NCLT ఆ రోజును ‘బైజూస్ డే’గా పేర్కొంది. బైజూస్‌పై దాఖలైన 10 పిటిషన్ల విచారణ ఆ రోజు జరగనుండటమే కారణం.

News June 27, 2024

ఆయన కోసమైనా భారత్ WC గెలవాలి: సెహ్వాగ్

image

కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా టీ20 WC-2024ని టీమ్‌ఇండియా గెలవాలని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. ‘సచిన్ కోసం 2011 ODI వరల్డ్‌కప్ గెలిచాం. ఇప్పుడు ద్రవిడ్ కోసం టీ20 WC గెలవాలి. ప్లేయర్‌గా ఆయనకు WC దక్కలేదు. కోచ్‌గా ఇప్పుడు గెలిచే ఛాన్సుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా భారత జట్టు కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీ తర్వాత ముగియనున్న సంగతి తెలిసిందే.