News June 27, 2024

LPL-2024లో ‘పవర్ బ్లాస్ట్ ఓవర్లు’

image

లంక ప్రీమియర్ లీగ్(LPL-2024)లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 1-6 ఓవర్లలో ఉండే పవర్ ప్లేకు అదనంగా 16, 17 ఓవర్లలో ‘పవర్ బ్లాస్ట్ ఓవర్లు’ ఉంటాయని పేర్కొంది. ఈ ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ బయట ఉండేందుకు అనుమతి ఉంటుంది. శ్రీలంక బోర్డు ఈ టీ20 లీగ్‌ను 2020లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది LPL జులై 1 నుంచి ప్రారంభం కానుంది.

News June 27, 2024

ఆగస్టుకు ముందే రుణమాఫీ చేసి చూపిస్తాం: భట్టి

image

TG: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టుకు ముందే చేసి చూపిస్తామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినవారు సంపదను దోచేసి రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని విమర్శించారు.

News June 27, 2024

TPCC చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

image

TPCC చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే CM రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. మరికాసేపట్లో డిప్యూటీ CM భట్టి హస్తినకు పయనం కానున్నారు. ఇవాళ రాత్రి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, మున్షీ, భట్టి భేటీ కానున్నారు. PCC చీఫ్ ఆశావహులపై చర్చించనున్నారు. కాగా జీవన్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

News June 27, 2024

జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టుల భర్తీ?

image

AP: 16,347 పోస్టులతో ఈ నెల 30 మెగా డీఎస్సీ <<13518354>>నోటిఫికేషన్<<>> విడుదలకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక <<13504415>>మొత్తం<<>> పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661, ఎస్సీ సంక్షేమ శాఖలో 439, బీసీ సంక్షేమ శాఖలో 170, ఎస్టీ సంక్షేమ శాఖలో 2,024, విభిన్న ప్రతిభావంతుల శాఖలో 49 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

News June 27, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

మరో గంటలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, HYD, జనగామ, గద్వాల, కామారెడ్డి, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండలో వాన పడొచ్చని పేర్కొంది. అలాగే నారాయణపేట, RR, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌లో వర్షంతో పాటు 40కి.మీ వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News June 27, 2024

కల్కి: రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన ప్రభాస్?

image

దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా పేరున్న ప్రభాస్ ‘కల్కి’కి ఫీజు సగానికి తగ్గించారట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.150కోట్లు తీసుకుంటారని, ‘కల్కి’కి రూ.80కోట్లే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు భారీగా బడ్జెట్(రూ.600కోట్లు) పెట్టాల్సి రావడమే ప్రభాస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అటు అమితాబ్, కమల్ హాసన్, దీపిక తలా రూ.20కోట్లు తీసుకున్నారట.

News June 27, 2024

నేనూ సోషల్ మీడియా బాధితురాలినే: హోంమంత్రి అనిత

image

AP: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు.

News June 27, 2024

ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

image

TG: మాజీ CM, BRS అధినేత KCR ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్‌గా కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో ‘‘సారు మళ్లీ ‘కారు’ నడపడం మొదలుపెట్టారు’’ అని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

News June 27, 2024

సీఎం రేవంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

image

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని KTR అన్నారు. కేంద్రంతో CM రేవంత్ కుమ్మక్కై BJPకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి పరిధిలోని పార్టీ నేతలు, బొగ్గు గని కార్మిక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News June 27, 2024

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి: ఎంపీ VSR

image

AP: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఎంపీ ట్వీట్ చేశారు. ‘ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరాను. వైజాగ్‌లో మెట్రో పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాను’ అని పేర్కొన్నారు.