News June 26, 2024

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

News June 26, 2024

రోడ్డు ప్రమాదం.. జనసేన ఎమ్మెల్యే తండ్రికి గాయాలు

image

AP: అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తండ్రి సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వర్షం కారణంగా సబ్బవరం సమీపంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను విశాఖ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

News June 26, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు: రేపు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీటు లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు. జూన్ 10నే ఛార్జిషీట్ దాఖలు చేసినా కొన్ని కారణాలతో వెనక్కి పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది.

News June 26, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు IND మెన్స్ హాకీ జట్టు ఇదే

image

ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు 16 మందితో భారత పురుషుల హాకీ జట్టును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, గోల్‌ కీపర్‌గా శ్రీజేశ్‌ వ్యవహరించనున్నారు. డిఫెన్స్‌ విభాగంలో హర్మన్‌ప్రీత్‌, జర్మన్‌ప్రీత్‌, అమిత్‌, సుమిత్‌, సంజయ్‌, మిడ్‌ ఫీల్డర్లుగా రాజ్‌ కుమార్‌, షంషేర్‌, మన్‌ప్రీత్‌, హార్దిక్‌, వివేక్‌ సాగర్‌, ఫార్వర్డ్‌లో అభిషేక్‌, సుఖ్‌జీత్‌, లలిత్‌, మన్‌దీప్‌, గుర్జంత్‌ ఉంటారు.

News June 26, 2024

SAvAFG: రెండింట్లో ఏది గెలిచినా చరిత్రే!

image

T20 WC సెమీస్‌లో భాగంగా రేపు ఉదయం 6గంటలకు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ట్రినిడాడ్‌లో తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఈ రెండూ ఎప్పుడూ ఫైనల్‌కు చేరలేదు. దీంతో ఏ జట్టు గెలిచినా చరిత్రకెక్కుతుంది. ట్రినిడాడ్‌లో పిచ్ మందకొడి కావడంతో తక్కువ స్కోర్లే నమోదు కావొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వాన కారణంగా రద్దైతే దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుతుంది. ఏ జట్టు గెలవొచ్చు? కామెంట్ చేయండి.

News June 26, 2024

అందుకే ఇన్‌స్టాను తొలగించలేను: రేణూ దేశాయ్

image

విపరీతమైన ట్రోల్స్, ద్వేషం కారణంగా తాను ట్విటర్ అకౌంట్‌ని తొలగించానని ఫేస్‌బుక్ ఉపయోగించట్లేదని నటి రేణూ దేశాయ్ తెలిపారు. ప్రమాద కేసులు, పిల్లలకు ఆహారం & మెడికల్ సపోర్ట్, కుక్కలకు వైద్యం అందించడానికి కొందరిని సమన్వయం చేసేందుకు మాత్రమే ఇన్‌స్టా వాడుతున్నట్లు చెప్పారు. ఇన్‌స్టా అకౌంట్‌ను తొలగించలేనని, దీని ద్వారానే గత 10 రోజుల్లోనే కొన్ని పిల్లులు, కుక్కలను సేవ్ చేయగలిగినట్లు ఆమె వెల్లడించారు.

News June 26, 2024

52 మెడిసిన్స్ క్వాలిటీ చెక్‌లో ఫెయిల్!

image

పారాసిటమాల్, పాన్టోప్రాజోల్ వంటి 52 రకాల మెడిసిన్స్ మే నెలలో నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో ఫెయిలయ్యాయి. వీటిలో అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ (22) నుంచే ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, TG, ఏపీ, ఎంపీ రాష్ట్రాల నుంచి సేకరించిన మిగతా శాంపిల్స్‌ కూడా నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేవని కేంద్రం గుర్తించింది. ఈ జాబితాలో Telmisartan, Diclofenac, Ambroxol సహా పలు మల్టీవిటమిన్, కాల్షియమ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి.

News June 26, 2024

జడేజా ఔట్.. సంజూకు ఛాన్స్?

image

T20WC: రేపు ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు జడేజాను తప్పించాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని ప్లేస్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జడేజా WCలో ఒక వికెట్, 15 రన్స్ మాత్రమే చేసి విఫలమయ్యారు. ఆల్‌రౌండర్లు అక్షర్, హార్దిక్ రాణిస్తున్నందున మరో బ్యాటర్‌ను తీసుకోవాలని యాజమాన్యం ఫిక్స్ అయ్యిందట. కాగా రేపు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

News June 26, 2024

విపక్ష నేతగా రాహుల్ గాంధీ.. అందే సౌకర్యాలివే

image

ఈ ఎన్నికల్లో INC 99 సీట్లను గెలుచుకోవడంతో రాహుల్ గాంధీకి విపక్ష నేత హోదా దక్కింది. దీంతో ఆయనకు కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు అందుతాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, Z+ కేటగిరీ భద్రత, పార్లమెంట్‌లో ఆయనకో కార్యాలయం, బంగ్లా, సిబ్బంది ఉంటారు. లోక్‌సభ ముందు వరుసలో తొలి సీటు కేటాయిస్తారు. EC ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, CBI, ED, విజిలెన్స్ కమిషన్ చీఫ్‌లను నియమించే కమిటీలో రాహుల్ కీలకంగా వ్యవహరిస్తారు.

News June 26, 2024

ఏడాదికి 30 లక్షల మంది చనిపోతున్నారు!

image

మద్యపానం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా మరణాల రేటు కాస్త తగ్గినప్పటికీ అది ఆమోదించలేనిదని పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తోందని చెప్పింది. 2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.6+ మిలియన్ల మంది చనిపోగా అందులో మూడొంతుల మంది పురుషులే ఉన్నారని తెలిపింది.