News June 26, 2024

కరాచీలో 4 రోజుల్లో 450 మంది మృతి

image

పాకిస్థాన్‌లోని కరాచీలో ఎండలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వడదెబ్బతో 450 మంది మరణించినట్లు స్థానిక NGO అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరాచీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చనిపోయినవారిలో అనేకమంది నిరాశ్రయులు, డ్రగ్స్ బానిసలేనని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మరణాలతో మార్చురీల్లో మృతదేహాలు పేరుకుపోయాయని చెప్పారు.

News June 26, 2024

బుమ్రా బంతులకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవు: కాలింగ్‌వుడ్

image

ఈ T20WCలో టీమ్ ఇండియా ప్రత్యేకంగా కనిపిస్తోందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్‌వుడ్ చెప్పారు. బుమ్రా సంధించే బంతులను ఎదుర్కొనేందుకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవన్నారు. అద్భుతమైన ఫామ్‌‌లో ఉన్న అతను కచ్చితత్వం, పేస్, నైపుణ్యంతో బౌలింగ్ చేస్తున్నారని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లోకి వచ్చారని, రేపు ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో IND ఓడిపోదని అనుకుంటున్నానని పేర్కొన్నారు.

News June 26, 2024

ప్రభాస్ కల్కి సినిమాకు ఏపీ ప్రభుత్వం GOOD NEWS

image

రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమా అదనపు షోకు <<13504290>>ఏపీ ప్రభుత్వం<<>> అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 5 షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రేపు ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తితో భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News June 26, 2024

రజనీ కొత్త లుక్

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ లుక్‌కు సంబంధించిన ఫొటోను దర్శకుడు Xలో షేర్ చేస్తూ ‘లుక్ టెస్ట్ ఫర్ కూలీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. క్షణాల్లో ఇది వైరలవ్వగా తలైవా లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

News June 26, 2024

కొడుకు స్కూల్ అడ్మిషన్‌ కోసం వెళితే లైంగిక వేధింపులు

image

శృంగార వీడియోల కేసులో అరెస్టయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్లిన తనను ప్రజ్వల్ లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా శృంగారం చేయాలంటూ అతను ఒత్తిడి చేశారని తెలిపారు. 2019-20 మధ్య 8-10 సార్లు ఇలా చేశారని, వీడియో రికార్డింగ్ చేసి బెదిరించారని తెలిపారు.

News June 26, 2024

BIG BREAKING: వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని, వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

News June 26, 2024

T20WC: ఇంగ్లండ్‌పై మనదే పైచేయి

image

రేపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఇరు జట్లు టీ20ల్లో ఇప్పటివరకు 23 సార్లు తలపడగా భారత్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. 11 మ్యాచుల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. ఇక ఐసీసీ టీ20 టోర్నీల్లో రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరగగా చెరో రెండు విజయాలు ఖాతాలో ఉన్నాయి. ఈ టోర్నీలో అజేయంగా ఉండటం భారత్‌కు సానుకూలాంశం. ఇంగ్లండ్ ఆడిన 7 మ్యాచుల్లో నాలుగింట్లోనే గెలిచింది.

News June 26, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రితో బీజేపీ నేతల చర్చలు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని రాష్ట్ర బీజేపీ నేతలు పురందీశ్వరి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కుమారస్వామిని ఢిల్లీలో కలిశారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు. దీన్ని లాభాలబాట పట్టించేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను వివరించారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి, అధికారులతో చర్చించాక మళ్లీ భేటీ అవుదామని వారికి బదులిచ్చారు.

News June 26, 2024

BREAKING: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానూకూలంగా స్పందించారు. అంతకుముందు గాంధీ, ఉస్మానియాలో జూడాల వసతిగృహాల నిర్మాణం, KMCలో రహదారుల పునరుద్ధరణకు నిధుల విడుదలకు జీవోలు ప్రభుత్వం జారీ చేసింది.

News June 26, 2024

మరోసారి $100 బిలియన్లు పంపారు!

image

విదేశాల్లోని భారతీయులు తమ కుటుంబీకులు/బంధువుల కోసం వరుసగా రెండో ఏడాది $100 బిలియన్లకుపైగా మొత్తాన్ని పంపారు. FY24లో వీరు $107 బిలియన్లు పంపించారు. ఇది విదేశీ పెట్టుబడుల నికర విలువ ($54 బిలియన్) కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. 2023లో అమెరికా నుంచే ఎక్కువగా భారత్‌కు ($125 బిలియన్లు) నిధులు వచ్చాయి. US నుంచి డబ్బు అందుకున్న దేశాల్లో భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో ($67B), చైనా ($50B) ఉన్నాయి.