News June 26, 2024
కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం వెళితే లైంగిక వేధింపులు

శృంగార వీడియోల కేసులో అరెస్టయిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్లిన తనను ప్రజ్వల్ లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా శృంగారం చేయాలంటూ అతను ఒత్తిడి చేశారని తెలిపారు. 2019-20 మధ్య 8-10 సార్లు ఇలా చేశారని, వీడియో రికార్డింగ్ చేసి బెదిరించారని తెలిపారు.
Similar News
News February 13, 2025
శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.
News February 13, 2025
మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
News February 13, 2025
భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!

భార్యల వేధింపులతో భర్తలు <<15216504>>బలవన్మరణానికి<<>> పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.