News June 26, 2024

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్‌

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ విచారిస్తున్నారు. ఇదే కోర్టులో వెకేషన్ జడ్జి నియాయ్ బిందు ఇటీవల కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఇదిలా ఉంటే తిహార్ జైలులో కేజ్రీవాల్‌ను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది.

News June 26, 2024

ఏపీలో వాలంటీర్లు కొనసాగడం డౌటేనా?

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లక్షలాది మంది వాలంటీర్లలో అనుమానాలు పెరుగుతున్నాయి. తమను కొనసాగిస్తారన్న నమ్మకం కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది.

News June 26, 2024

ఫేక్ అని తేలితే.. గుల్బాదిన్‌పై వేటు

image

T20WC బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ గాయం ఫేక్ అని తేలితే అతడిపై వేటు పడే అవకాశం ఉంది. ICC నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఆలస్యం చేస్తే 100% మ్యాచ్ ఫీజు, 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. ఒకవేళ ఒక క్రికెటర్‌కి ఏడాదిలో 4 డీమెరిట్ పాయింట్లు పడితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా 2 వన్డేలు/T20లు నిషేధం ఉంటుంది. అయితే ఇది అఫ్గాన్ జట్టుపై తక్షణ ప్రభావం చూపే అవకాశం లేదు.

News June 26, 2024

ఆగస్టు 15 నుంచి వందేభారత్ స్లీపర్!

image

మన దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వరకు గుజరాత్ మీదుగా ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం. స్లీపర్ ట్రైన్ కోచ్‌లు బెంగళూరులో తుదిరూపు దిద్దుకుంటున్నాయి. ఈ రైలు తొలుత గంటకు 130 కి.మీ వేగంతో వెళ్లనుందని, ఆ తర్వాత వేగాన్ని గంటకు 160-220 కి.మీ వరకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News June 26, 2024

సెబీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ& ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లో 97 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి రూ.44,500- రూ.89,150 వరకు జీతం అందుకోవచ్చు. నోటిఫికేషన్‌ కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in/sebimarc24/

News June 26, 2024

ట్రైన్‌లో మహిళ లగేజీ చోరీ.. రూ.లక్ష పరిహారం

image

2016లో ఓ ప్రయాణికురాలు ఢిల్లీ నుంచి ఇండోర్‌కు మాల్వా ఎక్స్‌ప్రెస్‌ రిజర్వేషన్ కోచ్‌లో వెళ్తుండగా ఆమె లగేజీ చోరీకి గురైంది. ఈ విషయంలో తాజాగా వినియోగదారుల కమిషన్ ఆమెకు రూ.లక్షకుపైగా పరిహారమివ్వాలని రైల్వేను ఆదేశించింది. ప్యాసింజర్ తన వస్తువులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే రైల్వే మేనేజర్ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ప్రయాణికులకు భద్రత, సౌకర్యం కల్పించడం రైల్వే విధి అని పేర్కొంది.

News June 26, 2024

డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిందేనా?

image

అలా అని ఎటువంటి నిబంధనా లేదు. 1956లో అప్పటి PM నెహ్రూ ఈ పదవిని ప్రతిపక్షాలకిచ్చే సంప్రదాయం ప్రారంభించారు. ఎమర్జెన్సీ కాలం, కొన్ని పర్యాయాలు మినహా ఆ పదవిని ప్రతిపక్షాలే పొందాయి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రస్తుతం INDIA కూటమి అడుగుతోంది. ఈసారి తమకు ప్రతిపక్ష హోదా(56 MPసీట్లు) ఉందంటోంది. గత 17వ లోక్‌సభలో CONGకు ప్రతిపక్ష హోదా లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ స్థానాన్ని కేంద్రం ఖాళీగా ఉంచేసింది.

News June 26, 2024

రూ.100 కోట్ల దిశగా ‘మహారాజ’

image

విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ మూవీ ఇప్పటివరకు రూ.85.3 కోట్లు రాబట్టింది. దీంతో త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

News June 26, 2024

వారసుడిని ప్రకటించిన వార్నర్!

image

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ వార్నర్ పరోక్షంగా వారసుడిని ప్రకటించారు. రిటైర్మెంట్ అనంతరం యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఓపెనర్‌గా వార్నర్ స్థానాన్ని జేక్ భర్తీ చేసే అవకాశం ఉంది. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతడు కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడారు.

News June 26, 2024

కల్కి 2898AD.. ఒక్కో టికెట్ రూ.2,300

image

హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్‌లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.