News June 25, 2024

DAO పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

image

TG: 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు TGPSC ఐడీ, DOB ఎంటర్ చేసిన హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు మల్టీసెషన్స్, CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని TGPSC తెలిపింది. ఉ.10 నుంచి 12.30 వరకు పేపర్-1, మ.2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయంది. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News June 25, 2024

ఉగ్రవాదికి నివాళి: కెనడా ప్రధానిపై వ్యతిరేకత

image

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ దేశ PM ట్రూడోపై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీవితకాలం కెనడాకు సేవ చేసిన వారికి ఇచ్చే గౌరవాన్ని నిజ్జర్‌కు ఇవ్వడం ఏమాత్రం సముచితం కాదంటూ ‘లిబరల్’ ఎంపీ చంద్ర ఆర్య ట్రూడోపై మండిపడ్డారు. విదేశీ ప్రభుత్వం హత్య చేసిందన్న ఆరోపణలతోనే అతడిని వారి సరసన చేర్చడం తప్పు అని తేల్చిచెప్పారు.

News June 25, 2024

IND vs ENG: సెమీఫైనల్‌కు వరుణ గండం?

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 27న జరిగే సెమీఫైనల్‌లో ఇండియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కాగా మ్యాచ్ జరిగే రోజు గయానాలో భారీ వర్షం కురవనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు 89 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఒకవేళ మ్యాచ్ రద్దయితే గ్రూప్-1లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమ్ ఇండియా ఫైనల్‌కు వెళ్తుంది. రిజర్వ్ డే లేకపోవడం భారత్‌కు కలిసిరానుంది.

News June 25, 2024

అయోధ్య లీకేజీకి డిజైన్ సమస్యలు కారణం కాదు: నృపేంద్ర మిశ్ర

image

అయోధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్ <<13504392>>లీకేజీ<<>> నిజమేనని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. అయితే దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని వెల్లడించారు. శిఖర నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అన్ని పైపులు మూసివేస్తామన్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.

News June 25, 2024

జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో వ్యాపార వర్గాలకు ఊరట?

image

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో కేంద్రం ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వివిధ చట్టాల్లోని 580 నిబంధనల్లో 310 ప్రావిజన్లను కొనసాగించనుంది. మిగిలిన వాటిలో శిక్షల తీవ్రత తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. TDS చెల్లింపులు లేట్ కావడం వంటి నేరాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేయొచ్చు. CGST చట్టాన్నీ సమీక్షిస్తోంది’ అని తెలిపాయి.

News June 25, 2024

కేసీఆర్‌‌కు మరోసారి నోటీసులు

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు ‘పవర్ కమిషన్’ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనెల 27లోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మరికొందరికి నోటీసులు పంపింది. కాగా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని ఇవాళ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News June 25, 2024

రేపు స్కూళ్లు బంద్.. ఫోన్లకు మెసేజ్‌లు

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా రేపు(జూన్ 26) స్కూళ్ల బంద్‌కు ABVP పిలుపునివ్వడంతో పలు విద్యాసంస్థలు ముందు జాగ్రత్తగా సెలవు ఇచ్చేస్తున్నాయి. స్కూలుకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో అక్రమ ఫీజులను అరికట్టాలని, ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ABVP ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News June 25, 2024

$100 బిలియన్ల మార్కెట్ క్యాప్ సాధించిన ICICI

image

ఈరోజు ట్రేడింగ్‌లో షేర్లు దూసుకెళ్లడంతో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ $100 బిలియన్లు (₹8.4లక్షల కోట్లు) దాటింది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ సంస్థగా ఐసీఐసీఐ నిలిచింది. జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రభావంతో నష్టపోయిన ఐసీఐసీఐ ఆ తర్వాతి సెషన్లలో పుంజుకుని 12% వృద్ధిని నమోదు చేసింది. ఇక $100 బిలియన్ల క్లబ్‌లో ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC, భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

News June 25, 2024

‘రీనీట్’ టీషర్ట్‌తో ప్రమాణం చేసిన ఎంపీ

image

నీట్ పేపర్ లీక్‌‌పై బిహార్ ఇండిపెండెంట్ MP పప్పూయాదవ్ లోక్‌సభలో వినూత్న నిరసన తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ‘రీనీట్’ టీషర్ట్ ధరించారు. ‘నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి’ అని నినదించారు. దీనికి సభలో ఉన్న కేంద్రమంత్రులు అభ్యంతరం చెప్పగా ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. ‘మీరు ఎంతమంది ఉన్నా నేను ఒక్కడినే పోరాడతా. స్వతంత్రంగా గెలుస్తున్న నాకు మీరు చెబుతున్నారా?’ అని కౌంటర్ ఇచ్చారు.

News June 25, 2024

విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ

image

రేపు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక దృష్ట్యా తమ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. సభకు తప్పనిసరిగా హాజరుకావాలని త్రీ లైన్ విప్‌లో పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలోనే ఉండాలని స్పష్టం చేసింది. కాగా NDA నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె.సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. రేపు ఎన్నిక ద్వారా స్పీకర్‌ను ఎంపీలు ఎన్నుకోనున్నారు.