News June 25, 2024
జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో వ్యాపార వర్గాలకు ఊరట?

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జన్‌విశ్వాస్ బిల్లు 2.0తో కేంద్రం ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వివిధ చట్టాల్లోని 580 నిబంధనల్లో 310 ప్రావిజన్లను కొనసాగించనుంది. మిగిలిన వాటిలో శిక్షల తీవ్రత తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. TDS చెల్లింపులు లేట్ కావడం వంటి నేరాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేయొచ్చు. CGST చట్టాన్నీ సమీక్షిస్తోంది’ అని తెలిపాయి.
Similar News
News February 8, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.
News February 8, 2025
చంద్రబాబు ప్రచారం చేసిన చోట్ల BJPకి ఆధిక్యం

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.