News June 25, 2024

ప్రజాస్వామ్యం షరతులతో నడవదు: రామ్మోహన్

image

స్పీకర్ ఎన్నికకు విపక్షాలు షరతులు విధించడం సరికాదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యం షరతులతో నడవదని, ఇలాంటి సంప్రదాయం మునుపెన్నడూ లేదని ఆయన విమర్శించారు. స్పీకర్ పదవికి సహకరించాలని, డిప్యూటీ స్పీకర్ పదవి అంశం చర్చకు వచ్చినప్పుడు మాట్లాడదామని రాజ్‌నాథ్ సింగ్ కోరినా విపక్షాలు వినడంలేదని ఆయన చెప్పారు.

News June 25, 2024

వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ -2024 ఇదే!

image

కుక్క పిల్లలు చూసేందుకు ముద్దుగా కనిపిస్తుంటాయి. మోస్ట్ బ్యూటిఫుల్ డాగ్స్ ఉన్నట్లే మోస్ట్ అగ్లీయెస్ట్ డాగ్స్ కూడా ఉంటాయి. వీటికి అవార్డ్స్ ఇచ్చేందుకు పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా కాలిఫోర్నియాలోని పెటలుమాలో జరిగిన ‘2024 వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్’ పోటీలో ‘పెకింగీస్ వైల్డ్ థాంగ్’ అనే కుక్క గెలుపొందింది. 8 ఏళ్ల వయసున్న ఈ డాగ్ ఇప్పటివరకు ఆరు సార్లు పోటీ పడగా ఎట్టకేలకు గెలుపొందింది.

News June 25, 2024

కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

image

AP: రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కుప్పం వెళ్లారు. ఎన్నికల్లో గెలుపు, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

News June 25, 2024

ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు YS జగన్ లేఖ

image

AP: తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్‌కు YS జగన్ లేఖ రాశారు. ‘మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధం. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఈ హోదా కోసం 10% సీట్లు ఉండాలని చట్టంలో లేదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాసమస్యలను బలంగా వినిపించొచ్చు’ అని తెలిపారు.

News June 25, 2024

కేసీఆర్‌కు ఊరట.. రైల్ రోకో కేసు విచారణపై స్టే

image

TG: మాజీ CM కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్‌ రోకో కేసు విచారణపై ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 18కి వాయిదా వేసింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు KCR పిలుపునిచ్చారని ఇటీవల పోలీసులు నివేదికలో పొందుపర్చారు. అయితే తాను ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని మాజీ సీఎం నిన్న హైకోర్టును ఆశ్రయించారు.

News June 25, 2024

యూకే జైలు నుంచి విడుదలైన అసాంజే

image

యూకేలో కారాగార శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విడుదలయ్యారు. USకు చెందిన రహస్య సమాచారాన్ని సేకరించారన్న ఆరోపణలను అంగీకరించేందుకు అసాంజే సిద్ధమయ్యారు. దీనిపై USతో ఒప్పందం కుదుర్చుకోవడంతో విచారణకు హాజరయ్యేందుకు యూకే కోర్టు ఆయనను రిలీజ్ చేసింది. కాగా 2010లో అఫ్గాన్, ఇరాక్‌లో US యుద్ధాలకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను వికీలీక్స్ రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనమైంది.

News June 25, 2024

వైసీపీ మాజీ ఎంపీపై కేసు నమోదు

image

AP: విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై కేసు నమోదైంది. MOU పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆయనపై హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఫిర్యాదు చేశారు. విలువైన భూములు కాజేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఆరిలోవ పోలీసులు MVVతో పాటు ఆయన ఆడిటర్ వెంకటేశ్వరరావు, రియల్టర్ బ్రహ్మాజీపై 10 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. MVV వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

News June 25, 2024

సనాతన ధర్మంపై విమర్శలు.. కోర్టుకు హాజరైన ఉదయనిధి

image

సనాతన ధర్మాన్ని అవమానించారనే అభియోగంపై తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ బెంగళూరు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు రూ. లక్ష పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కేసును ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఉదయనిధి <<11549760>>సనాతన ధర్మాన్ని<<>> డెంగీ, మలేరియా, కరోనాతో పోల్చుతూ దీనిని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

News June 25, 2024

వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు. పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కాగా ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన Xలో పోస్ట్ చేసింది.

News June 25, 2024

సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ విడుదల

image

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల తేదీతో స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ పాత్రలో అనుప‌మ్ ఖేర్ నటిస్తున్నారు.