News June 25, 2024
కేసీఆర్‌కు ఊరట.. రైల్ రోకో కేసు విచారణపై స్టే

TG: మాజీ CM కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్ రోకో కేసు విచారణపై ధర్మాసనం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 18కి వాయిదా వేసింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు KCR పిలుపునిచ్చారని ఇటీవల పోలీసులు నివేదికలో పొందుపర్చారు. అయితే తాను ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని మాజీ సీఎం నిన్న హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 18, 2025
సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.
News February 18, 2025
మా నాయకత్వాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో ‘లీడర్‌షిప్ రొటేషన్’లో భాగంగా సీఎంగా సిద్ధరామయ్యను తప్పించి మరో నేతను కాంగ్రెస్ ఎంపిక చేస్తుందన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని, దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు సీఎం పదవి రావొచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
News February 18, 2025
ఢిల్లీ తొక్కిసలాటలో కుట్ర కోణం లేదు: రైల్వే మంత్రి

ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. ‘తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు. కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్‌కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని స్టేషన్‌కు లోపల, బయటా మోహరించినట్లు అధికారులు తెలిపారు.