News June 25, 2024

T20WCలో వేగవంతమైన హాఫ్ సెంచరీలు

image

* యువరాజ్‌సింగ్(IND) 12బంతుల్లో(2007లో vs ENG)
* స్టీఫెన్ మైబర్గ్(NED) 17బంతుల్లో(2014లో vs IRE)
* స్టోయినిస్(AUS) 17బంతుల్లో(2022లో vs SL)
* మ్యాక్స్‌వెల్(AUS) 18బంతుల్లో(2014లో vs PAK)
* KL రాహుల్(IND) 18బంతుల్లో(2021లో vs SCO)
* మాలిక్(PAK) 18బంతుల్లో(2021లో vs SCO)
* రోహిత్‌శర్మ(IND) 19బంతుల్లో(2024లో vs AUS)
* అష్రాఫుల్(BAN) 20బంతుల్లో(2007లో vs WI)
* యువరాజ్(IND) 20బంతుల్లో(2007లో vs AUS)

News June 25, 2024

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు TGలోనూ 2 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

News June 25, 2024

ఫుడ్ కలర్స్‌పై నిషేధం విధించిన కర్ణాటక

image

ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. చికెన్, ఫిష్ కబాబ్‌, శాకాహార వంటకాల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని పేర్కొంది. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్‌ను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

News June 25, 2024

YS జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను కూల్చిన అధికారికి ప్రమోషన్!

image

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటిముందు నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిచ్చిన IAS అధికారి హేమంత్ సహదేవరావ్‌కు TG ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమించింది. HYD లోటస్ పాండ్‌లోని జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాల కూల్చివేతకు హేమంత్ ఆదేశాలిచ్చారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ఆయనపై ప్రభుత్వం వేటు వేసి, తాజాగా ప్రమోషన్ ఇచ్చింది.

News June 25, 2024

మరోసారి వర్షం.. ఆగిన మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న కీలక సూపర్8 మ్యాచ్‌కి మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. 3.2 ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 31 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 85 రన్స్ చేయాలి. బంగ్లా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 115/5 చేసింది.

News June 25, 2024

భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం

image

హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 105% పెరిగినట్లు L&T సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా, 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. దీంతో గత ఏడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది. 2022-23లో రూ.1315.99 కోట్లుగా ఉన్న నష్టాలు, 2023-24లో రూ.555.04కోట్లకు తగ్గాయి. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆరేళ్లలో నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయి.

News June 25, 2024

ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి!

image

సూపర్ 8 గ్రూప్-1లో భారత్ ఇప్పటికే SF బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, అఫ్గాన్, బంగ్లా పోటీ పడుతున్నాయి.
*నేడు బంగ్లాపై గెలిచినా, వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా అఫ్గానిస్థాన్ నేరుగా SFకు వెళ్తుంది.
*AFG నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలో ఛేదిస్తే బంగ్లా SFకు వెళ్తుంది.
*బంగ్లా 12.1 ఓవర్ల తర్వాత గెలిస్తే AUS సెమీఫైనల్‌కు వెళ్తుంది.

News June 25, 2024

REWIND: అనూహ్యంగా WC గెలిచిన భారత్

image

సరిగ్గా 40ఏళ్ల క్రితం అంటే 1983 జూన్ 25కు ముందు ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఓ అనామక జట్టు. ఆ వరల్డ్ కప్‌లో అనూహ్యంగా ఫైనల్ చేరిన కపిల్ సేన తుది పోరులో అరవీరభయంకర వెస్టిండీస్‌ను మట్టికరిపించి కప్ నెగ్గింది. అప్పటి నుంచి క్రికెట్‌లో మన ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత 2007లో T20WC, 2011లో ODI వరల్డ్ కప్ సాధించింది. ఇప్పుడు మరో T20WC గెలిచేందుకు 2అడుగుల దూరంలో ఉంది. మరి రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి.

News June 25, 2024

DSC పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలు ఇవే

image

AP: 16,347 DSC పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SKLMలో 543, VZM 583, విశాఖ 1134, తూ.గో 1346, ప.గో 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, ATP 811, కర్నూలు 2678 ఖాళీలు ఉన్నాయి. ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.

News June 25, 2024

రైతుభరోసా మార్పులపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటాం: మంత్రి

image

TG: రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొద్దు? అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. నేడు రైతు వేదికల్లో అన్నదాతలతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. రైతుల సూచనలనూ పరిగణనలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ నిబంధనలు రూపొందిస్తుందని చెప్పారు.