News June 25, 2024

జూన్ 25: చరిత్రలో ఈ రోజు

image

1932 : భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును లార్డ్స్‌లో ఆడింది
1945 : సినీ నటి శారద జననం
1975 : ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటన
2009 : సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ మరణం
1931: మాజీ పీఎం విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం
1983: భారత్ మొట్టమొదటి ప్రపంచకప్ గెలుపు
కలర్ టీవీ డే

News June 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 25, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 25, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:44 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 25, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 25, మంగళవారం
జ్యేష్ఠము
బ.చవితి: రాత్రి 11:11 గంటలకు
శ్రవణ: మ.02:32 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.08:16-09:08, రా.11:04-11:48, గంటల వరకు
వర్జ్యం: సా.06:18-07:48 వరకు

News June 25, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ఎంపీల ప్రమాణస్వీకారం
* AP: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం
* సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ: మంత్రి పార్థసారథి
* వాలంటీర్లకు ఇచ్చే అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం
* కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలి: జగన్
* TG: బీఆర్ఎస్ పని ఖతం: షబ్బీర్ అలీ
* ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా

News June 25, 2024

సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

image

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

News June 24, 2024

అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు: పోలీసులు

image

TG: హైదరాబాద్‌లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలపై నగర పోలీసులు స్పందించారు. ‘సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. దుకాణాలు, సంస్థలు తెరిచే మరియు మూసివేసే సమయాలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. ఇది అందరూ గమనించగలరు’ అని ట్వీట్ చేశారు.

News June 24, 2024

ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్ చేశారు. ఇవాళ ఆస్ట్రేలియాపై ఊచకోతతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(4,165) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్(4,145), కోహ్లీ (4,103) ఉన్నారు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు(132vsAUS) బాదిన ప్లేయర్‌గా నిలిచారు. T20Iల్లో 200 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించారు.

News June 24, 2024

ఏపీలో ప్రభాస్ కల్కి మూవీ టికెట్ రేట్ల పెంపు

image

AP: ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి- 2898AD’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ <<13492922>>ప్రభుత్వం<<>> అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2వారాల పాటు సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.125 మేర పెంచుకోవచ్చంది. అలాగే రోజుకు ఐదు షోలు వేసేందుకు కూడా అనుమతిచ్చింది. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచింది. ఈ నెల 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.