News June 24, 2024

తొలిసారి పిలుపొచ్చింది

image

జింబాబ్వేతో T20 సిరీస్‌కు <<13502519>>జట్టు<<>>లో నలుగురు ఆటగాళ్లు తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. తెలుగు తేజం నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండేకు జట్టులో చోటు దక్కింది. వీరంతా తొలిసారి టీమ్ ఇండియా జెర్సీలో కనిపించనున్నారు. ఈ ఏడాది IPLలో ఈ ప్లేయర్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జురెల్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.

News June 24, 2024

భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న <>దరఖాస్తు<<>> ప్రక్రియ జులై 24న ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసి, పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్ల మధ్య వయసువారు అప్లికేషన్‌కు అర్హులు. పరీక్ష ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, PWd వారికి మినహాయింపు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్, టైర్-2 డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు SSC ప్రకటించింది.

News June 24, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని TDP ఎమ్మెల్సీల వినతి

image

AP: గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్‌ని వాయిదా వేయాలని APPSC సెక్రటరీని TDP MLCలు కోరారు. ఈ మేరకు MLCలు వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు. జులై 28న జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. ముఖ్యంగా కొత్త సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు గాను అభ్యర్థులకు మరికొంత సమయం కావాలన్నారు. కాగా మెయిన్స్‌కు 92,250 మంది క్వాలిఫై అయ్యారు.

News June 24, 2024

తెలంగాణ తరహాలో మాకూ రుణమాఫీ కావాలి: పంజాబ్ రైతులు

image

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతించిన పంజాబ్ రైతులు తమకూ ఆ తరహా మాఫీ కావాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ కింద ఏటా వచ్చే ₹6వేలతో తమ భారం తీరట్లేదని, కాబట్టి రుణమాఫీ చేయాలని కేంద్రాన్ని కిసాన్ మజ్దూర్ మోర్చా కోరింది. 2018లో నాటి సీఎం అమరేందర్ సింగ్ మాఫీ ప్రకటించినా కేవలం 5.63లక్షల మందికే లబ్ధి చేకూరిందని తెలిపింది. కాగా రుణమాఫీతో TG ప్రభుత్వంపై ₹31వేలకోట్ల భారం పడనుంది.

News June 24, 2024

గంభీర్ కండీషన్లలో రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్‌ కూడా?

image

టీం ఇండియా హెడ్‌ కోచ్‌గా వచ్చేందుకు గంభీర్ పలు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. అవి.. క్రికెట్ వ్యవహారాల్లో ఎవరి జోక్యాలు, ఒత్తిళ్లు ఉండరాదు. సహాయక సిబ్బంది ఎంపికలో ఇంకెవరి పాత్ర ఉండొద్దు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే జట్టు నుంచి రోహిత్, విరాట్ వంటి సీనియర్లందర్నీ తప్పించాలి. టెస్టుల కోసం ప్రత్యేక జట్టును రెడీ చేయాలి. 2027 ODI వరల్డ్ కప్‌ కోసం ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్‌నకు అనుమతించాలి.

News June 24, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి GOOD NEWS

image

AP: రేషన్ కార్డులు ఉన్న వారికి జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా, మిగతా జిల్లాలకు విస్తరించనుంది. 3KGల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచి శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేషన్ కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేయనున్నారు. రాగులు, జొన్నలు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం పొందవచ్చు.

News June 24, 2024

ప్రధాని మోదీపై సీఎం మమత ఫైర్

image

తీస్తా నది అంశంపై బంగ్లాదేశ్ PM షేక్ హసీనాతో PM మోదీ జరిపిన చర్చకు తమను ఆహ్వానించకపోవడంపై బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదన్నారు. తీస్తా నది బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన హసీనా.. తీస్తా అంశాన్ని లేవనెత్తారు. దీంతో తమ సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని ఆమెకు PM చెప్పారు.

News June 24, 2024

హోంమంత్రికి పవన్ సూచనలు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చీరాలలో యువతి రేప్ కేసు, రాష్ట్రంలో మహిళల అదృశ్యం ఘటనల వివరాలను పవన్‌కు ఆమె వివరించారు. శాంతిభద్రతలు, డ్రగ్స్, గంజాయి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని హోంమంత్రికి పవన్ ఈ సందర్భంగా సూచించారు.

News June 24, 2024

జింబాబ్వే-భారత్ T20 సిరీస్ షెడ్యూల్

image

☛ జులై 6- తొలి T20- హరారే
☛ జులై 7- రెండో T20-హరారే
☛ జులై 10- మూడో T20-హరారే
☛ జులై 13- 4వ T20-హరారే
☛ జులై 14- 5వ T20-హరారే
☛ ☛ అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

News June 24, 2024

జింబాబ్వేతో T20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI

image

జింబాబ్వేతో ఆ దేశంలో జులై 6 నుంచి ప్రారంభమయ్యే <<13502577>>T20 సిరీస్<<>> కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్(WK), ధ్రువ్ జురెల్(WK), నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలను ఎంపిక చేసింది.