News June 23, 2024

ఈనెల 26 నుంచి అమల్లోకి కొత్త టెలికం చట్టం

image

దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.

News June 23, 2024

ఘోరం.. కన్నబిడ్డను ఎత్తి బావిలో పడేశాడు

image

అనుమానం పెనుభూతమై కన్నతండ్రిని కర్కశుణ్ని చేసింది. అనంతపురం(D) నార్పలకు చెందిన గణేశ్.. భార్యకు వివాహేతర సంబంధముందని, కూతురు పావని(6) తనకు పుట్టలేదని అనుమానించేవాడు. జూన్ 20న పావనిని స్కూల్ నుంచి బయటకు తెచ్చి పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈత నేర్పిస్తాంటూ దూకమన్నాడు. ఆ పాప భయమేస్తోందంటూ గుక్కపట్టి ఏడ్చింది. కనికరం చూపని గణేశ్ పాపను ఎత్తి బావిలో పడేశాడు. పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు.

News June 23, 2024

తాండూరు-జహీరాబాద్ రైల్వే లైన్ ఫైనల్ ‘సర్వే’

image

TG: తాండూరు-జహీరాబాద్ మధ్య 70KM దూరంతో కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్-వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్-బీదర్ రూట్‌లో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వికారాబాద్ మీదుగా ఈ 2 పట్టణాలకు ప్రస్తుతం రైలు మార్గం ఉన్నా, 104KM దూరం ఉండటంతో ఎక్కువ మంది బస్సుల్లోనే వెళ్తున్నారు.

News June 23, 2024

రూ.7 వేల పింఛనుతో పాటు నూతన పాసు పుస్తకాలు: మంత్రి

image

AP: పింఛను పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను MSME, సెర్ప్, NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పెంచిన పింఛను మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7వేలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన పాసుపుస్తకాలనూ పింఛనుతో పాటు అందించాలన్నారు. ప్రతి జిల్లాలో 10 మహిళా మార్టులు ఏర్పాటు చేయాలన్నారు.

News June 23, 2024

‘కల్కి‘ నటుల రెమ్యునరేషన్ ఎంతంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణెలు తలో రూ.20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దిశాపటానీ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. రూ.250 కోట్లు రెమ్యునరేషన్లకే ఇచ్చినట్లు టాక్.

News June 23, 2024

చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!

image

AP DGP ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి DGP శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు. HCUలో PG పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్‌ కేడర్‌కు వెళ్లారు. వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

News June 23, 2024

30 నుంచి DAO రాతపరీక్షలు

image

TG: రాష్ట్రంలో 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి పరీక్షలు జరుగుతాయని TGPSC తెలిపింది. జూలై 4 వరకు మల్టీసెషన్స్, CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయంది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News June 23, 2024

జనసేన పార్టీకి మరో పదవి?

image

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పనపై కూలంకషంగా చర్చలు జరుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాలపై లోతుగా సభలో విశ్లేషణలు చేస్తామన్నారు. అటు జనసేన పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తమ పార్టీనే తీసుకునే ఛాన్స్ ఉందన్నారు.

News June 23, 2024

NTA కొత్త చీఫ్‌గా ప్రదీప్ సింగ్ ఖరోలా

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్‌గా ప్రదీప్ సింగ్ ఖరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్, ఎండీ‌గా ఉన్న ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాగా నీట్, నెట్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై కేంద్రం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన నీట్-PG పరీక్షను సైతం రద్దు చేశారు.

News June 23, 2024

సంచలన కేసు.. 48 గంటల్లో నిందితులు అరెస్ట్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల(D) ఈపురుపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై CM సీరియస్ కావడం, <<13485589>>హోం మంత్రి<<>> ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు SP వకుల్ తెలిపారు. నిందితులు దేవరకొండ విజయ్, మహేశ్‌తో పాటు శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు.