News June 21, 2024

CSIR యూజీసీ-నెట్ వాయిదా: NTA

image

CSIR యూజీసీ-నెట్ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్లు NTA ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగే పరీక్షలను లాజిస్టిక్ సమస్యలు, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు https://csirnet.nta.ac.in/ సైట్ చూడాలని సూచించింది.

News June 21, 2024

డయేరియాపై CS సమీక్ష.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రచారం

image

AP: రాష్ట్రంలో డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలుచేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఇందులో గ్రామవార్డు సచివాలయాల సిబ్బందిని, ANM అంగన్వాడీ సిబ్బందిని భాగం చేయాలన్నారు.

News June 21, 2024

పుణే యాక్సిడెంట్.. నిందితుడి తండ్రికి బెయిల్

image

పుణేలో కారుతో ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందితుడి(17) తండ్రి విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరైంది. మే 19న మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపిన ఆ బాలుడు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మృతికి కారణమయ్యాడు. కాగా తమ కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు బ్లడ్ శాంపిల్స్ మార్చారనే కారణంతో తండ్రి విశాల్ అగర్వాల్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పుణేలోని సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

News June 21, 2024

రేణుకాస్వామి కేసులో విస్తుపోయే విషయాలు

image

కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామిని టార్చర్ చేసి చంపడాన్ని నటి పవిత్ర గౌడ దగ్గరుండి వీక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్శన్‌కు క్లోజ్ ఫ్రెండైన పవిత్ర గురించి అసభ్యకరమైన పోస్ట్ చేయడంతో స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200km దూరంలోని ఓ షెడ్డులో బంధించి కర్రలతో కొట్టి, కరెంట్ షాక్‌ పెట్టారట. సాక్ష్యాలు చెరిపివేసేందుకు దర్శన్ మరో ఫ్రెండ్ దగ్గర రూ.40లక్షలు అప్పు చేశారని పేర్కొన్నారు.

News June 21, 2024

రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా?

image

రాజ్యసభ పక్షనేతగా కేంద్ర మంత్రి JP నడ్డాను బీజేపీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికానందున మరో 6-7 నెలలు అధ్యక్ష పదవిలో కొనసాగాలని ఆయనకు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది.

News June 21, 2024

కల్కి రిలీజ్ ట్రైలర్ ఆలస్యం.. నిర్మాణ సంస్థపై అభిమానుల ఫైర్

image

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్ విడుదల ఆలస్యం కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WorstBannerVyjayanthiFilms అంటూ Xలో పోస్టులు చేస్తున్నారు. తొలుత ఇవాళ రాత్రి 6 గంటలకు, ఆ తర్వాత రా.8కి రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికీ అప్డేట్ ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాగా ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

News June 21, 2024

గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలు

image

అందమైన గోవా బీచ్‌లలో మద్యం తాగుతూ, చెత్తను పడేస్తున్న టూరిస్టుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో అక్కడ ‘కలంగుట్ బీచ్’ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘పర్యాటకులు ఇక్కడికి రావడానికి ముందు తప్పనిసరిగా హోటల్ రిజర్వేషన్లు చూపించాలి. ఇందుకోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. బీచ్‌లో ఆహార వ్యర్థాలు, మద్యం బాటిళ్లు, చెత్త పడేసిన వారిని గుర్తించి పన్ను వసూలు చేస్తాం’ అని సర్పంచ్ జోసెఫ్ వెల్లడించారు.

News June 21, 2024

సభాపతిగా అయ్యన్నపాత్రుడు.. సభకు రాకూడదని వైసీపీ నిర్ణయం

image

స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని YCP నిర్ణయించింది. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే జగన్ రేపు వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు. కాగా ‘జగన్ ఓడిపోయాడు కానీ <<13442979>>చావలేదు<<>>’ అని అయ్యన్నపాత్రుడు, ఓ వ్యక్తి 2 రోజుల క్రితం సంభాషించుకున్నారు. ఈ వ్యాఖ్యల వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News June 21, 2024

బాలయ్య ప్రమాణం: బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్

image

AP: సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్నా.. నువ్వెప్పుడూ ప్రజల హీరోవి. నిరంతరం ప్రజల గుండెల్లోనే ఉంటావు. వారిని సంతోషంగా ఉంచేందుకు శ్రమిస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్నా’ అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా హిందూపురం నుంచి MLAగా బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News June 21, 2024

గనుల వేలంపై ఎందుకు ప్రశ్నించరు?: KTR

image

TG: రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులు సింగరేణికి అప్పగించాలని గతంలో డిమాండ్ చేసిన CM రేవంత్‌ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని KTR ప్రశ్నించారు. ‘సింగరేణి ప్రైవేటీకరణకు దారి తీసే బొగ్గు క్షేత్రాల వేలానికి మీరు అంగీకరించకుండానే వేలంపాట జరుగుతోందా? NDA ప్రభుత్వం గుజరాత్, ఒడిశాలోని గనులకు వేలం నుంచి మినహాయింపు ఇస్తే తెలంగాణకూ మినహాయింపు ఇవ్వమని మీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు?’ అని ట్వీట్ చేశారు.