News June 21, 2024

GNWL కాదు WL చూసి బుక్ చేసుకోండి!

image

ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు వచ్చే GNWL/WL విషయంలో కొందరు అయోమయపడుతుంటారు. GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్టులో ఎంతమంది ఉన్నారో చూపిస్తుంది. ఉదా.GNWL30/WL8 ఉంటే మొత్తం 30 మంది వెయిటింగ్ లిస్టు జాబితాలో టికెట్ బుక్ చేయగా అందులో 22 మంది టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారని అర్థం. అంటే నిజానికి వెయిటింగ్‌ లిస్టులో ఉన్నది 8 మంది మాత్రమే. సో, ఈసారి టికెట్ బుక్ చేసేటప్పుడు WL చూసి చేసుకోండి.

News June 21, 2024

బాయ్ ఫ్రెండ్ ‘మాట తప్పాడని’ కేసు పెట్టిన యువతి

image

ఆరున్నరేళ్లుగా రిలేషన్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్ తనకిచ్చిన మాట తప్పాడంటూ ఓ యువతి కోర్టులో కేసు వేసింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. ఓ ప్రోగ్రామ్ కోసం వెళ్లాల్సిన తనను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తానని చెప్పి విఫలమయ్యాడని ఆమె తెలిపారు. తనకు వృథా అయిన ఖర్చులను అతను చెల్లించేలా ఆదేశించాలని కోరారు. అయితే మౌఖిక ఒప్పందాలకు చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

News June 21, 2024

కాంగ్రెస్ కమిటీలు రద్దు: వైఎస్ షర్మిల

image

AP: రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని విభాగాల కమిటీలు రద్దు చేసినట్లు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ పార్టీ తరఫున ఒక్కరు కూడా చట్టసభలకు ఎన్నిక కాలేదు.

News June 21, 2024

లడ్డూ తయారీకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి వాడండి: EO

image

శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు తగ్గుతోందని EO శ్యామలారావు పోటు సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో వర్క్ లోడ్ ఎక్కువవుతోందని అధికారులు ఆయనకు వివరించారు. ముడిపదార్థాల నాణ్యత పెంచాలని కోరారు. తక్కువ ధరకు కోట్ చేసిన గుత్తేదారు సరుకులను సప్లై చేస్తున్నారని EO దృష్టికి తెచ్చారు. బెస్ట్ క్వాలిటీ నెయ్యి, శనగ పిండి ఉపయోగించి నమూనా లడ్డూలు తయారు చేయాలని పోటు సిబ్బందికి EO సూచించారు.

News June 21, 2024

2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ప్రయత్నం

image

ఒలింపిక్స్ గేమ్స్‌కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2036 కోసం దాఖలు చేసే బిడ్ విజయవంతం కావాలంటే ఏం చేయాలనే అంశాలపై మిషన్ ఒలింపిక్స్ సెల్ క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఓ రిపోర్టును అందించింది. అలాగే కొత్తగా యోగా, చెస్, T20 క్రికెట్, కబడ్డీ, స్క్వాష్, ఖోఖో క్రీడలను ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టాలని సూచించింది. దీనివల్ల భారత్‌కు పతకాల సంఖ్య పెరుగుతుందని తెలిపింది.

News June 21, 2024

T20 చరిత్రలో భారత్ అరుదైన రికార్డు

image

T20WC సూపర్-8లో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 10 మంది బ్యాటర్లనూ క్యాచ్ రూపంలోనే ఔట్ చేసింది. షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో భారత్‌ ఇలా చేయడం ఇదే తొలిసారి. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 3 క్యాచ్‌లు, రోహిత్ శర్మ 2, అర్షదీప్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు.

News June 21, 2024

‘కోకాకోలా’ వారసుడి లైంగిక వేధింపులు.. $900M చెల్లించాలని కోర్టు ఆదేశం

image

లైంగిక వేధింపుల కేసులో కోకాకోలా కంపెనీ వారసుడు అల్కీ డేవిడ్‌కు US కోర్టు షాకిచ్చింది. బాధితురాలికి $900M చెల్లించాలని ఆదేశించింది. ఈ తరహా కేసుల్లో ఇదే అతిపెద్ద నష్టపరిహారం. డేవిడ్ 2016-19 మధ్య జేన్ డో అనే మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు లాయర్ వెల్లడించారు. మరో మహిళపై అత్యాచార కేసు విచారణలో ఉండగానే అతను ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ ఆయన $70M పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు.

News June 21, 2024

పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతా: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

image

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఆయన చేసిన పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. ‘త్వరలో సాక్ష్యాధారాలతో సహా పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతా. పెద్దిరెడ్డి విముక్త రాయలసీమే నా లక్ష్యం. ఆయన అరాచకాలు లేకుండా సీమ ప్రజలను సంతోషంగా ఉంచుతా’ అని ఆయన పేర్కొన్నారు.

News June 21, 2024

శ్రీవారికి సమర్పించిన బ్రాండెడ్ వాచ్‌లు ఈ వేలం: TTD

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్‌లను ఈ వేలం వేయనున్నట్లు TTD బోర్డు తెలిపింది. ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌లో ఈ-వేలం వేయనున్నట్లు చెప్పింది. టైటాన్, CASIO, VIVO, OPPO, నోకియాతో పాటు మరికొన్ని బ్రాండ్లకు చెందిన వాచ్‌లు, ఫోన్లు ఉన్నట్లు వెల్లడించింది. వివరాలకు <>tirumala.org<<>> ని సంప్రదించండి.

News June 21, 2024

T20WCలో ఆస్ట్రేలియా సూపర్ రికార్డు

image

T20 వరల్డ్ కప్‌ హిస్టరీలో వరుసగా అత్యధిక విజయాలు(8*) సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. 2022-24 మధ్య ఈ ఘనత సాధించింది. గతంలో ఇంగ్లండ్ వరుసగా 7(2010-12), ఇండియా 7(2012-14), ఆస్ట్రేలియా 6(2010), శ్రీలంక 6(2009), ఇండియా 6(2007-09) మ్యాచ్‌లు గెలిచాయి. అలాగే షార్ట్ ఫార్మాట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఆసీస్ వరుసగా 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది.