News January 11, 2025

ఎన్ని గంటలు కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యం: రాజీవ్ బజాజ్

image

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత వర్క్ క్వాలిటీగా చేశామన్నదే ముఖ్యమని బజాజ్ ఆటో సంస్థ MD రాజీవ్ బజాజ్ అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలన్న సుబ్రమణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. 90 గంటల పనే కావాలంటే అది పైస్థాయి ఉద్యోగుల నుంచే మొదలుపెట్టాలన్నారు. ఆదివారాలు కూడా పనిచేయాలంటూ లేబర్ నిబంధనలు అతిక్రమిస్తున్న సుబ్రమణ్యన్‌‌పై చర్యలు తీసుకోవాలని CPI(ML) MP రాజారామ్ డిమాండ్ చేశారు.

News January 11, 2025

విశాల్ అనారోగ్యానికి ఆ సినిమానే కారణమా?

image

కోలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘వాడు వీడు’ మూవీ షూటింగ్ సమయంలో విశాల్ చెట్టుపై నుంచి కిందపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కారణంగానే ఆయన ఈ స్థితికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

News January 11, 2025

Podcast: గోద్రా అల్లర్లపై మోదీ ఏమన్నారంటే?

image

2002 గోద్రా అల్లర్ల సమయంలో రైలు తగలబెట్టిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని PM మోదీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘ఘటన గురించి తెలియగానే అక్కడికి వెళ్తానని అధికారులు చెప్పా. కానీ సింగిల్ ఇంజిన్ చాపర్ మాత్రమే ఉండటంతో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. చాలాసేపు వాదించి ఏం జరిగినా నేనే బాధ్యుడినని చెప్పా. గోద్రాలో మృతదేహాలను చూసి చలించిపోయా. కానీ ఓ హోదాలో ఉన్నందున ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నా’ అని చెప్పారు.

News January 11, 2025

BREAKING: ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి

image

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు.

News January 11, 2025

అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు

image

నాలుగేళ్ల తర్వాత పారిస్‌కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్‌లైన్స్ చేసిన పోస్టు ట్రోల్‌కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్‌పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్‌లైన్స్‌ను EU బ్యాన్ చేసింది.

News January 11, 2025

మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్‌సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్‌లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.

News January 11, 2025

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్‌కు ప్రధాని మోదీ

image

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్‌కు వచ్చారు.

News January 11, 2025

జనవరి 11: చరిత్రలో ఈరోజు

image

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చిన రోజు
* 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం
* 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం(ఫొటోలో)
* 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు
* 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం

News January 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 11, 2025

హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట

image

డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. ఆయన దోషిగా తేలినప్పటికీ అన్‌కండీషనల్ డిశ్చార్జ్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ప్రజలు ఆయన్ను నమ్మి అధ్యక్షుడిగా గెలిపించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అధ్యక్షుడికి అందించే రక్షణ ప్రయోజనాలను ఇస్తూ జైలు శిక్ష లేదా జరిమానా గానీ విధించడం లేదని న్యాయమూర్తి అన్నారు. కాగా.. నేర నిరూపణ అయిన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ ఆ దేశ చరిత్రలో నిలిచిపోనున్నారు.