News January 9, 2025

బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోండి: బీవీ రాఘవులు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.

News January 9, 2025

ఇండియా కూటమిని మూసేయండి: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభేదాలను మరింత పెంచాయి. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా JK CM ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్వరంతో మాట్లాడారు. లోక్‌సభ వరకే పరిమితం అనుకుంటే ఇండియా కూటమిని మూసేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యూహాలేమీ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. INDIA కేవలం లోక్‌సభ వరకే పరిమితమన్న RJD నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై ఇలా స్పందించారు.

News January 9, 2025

తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి తిరుపతికి బయల్దేరారు. నిన్న తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. కాగా, ఘటనకు సంబంధించి నివేదిక ఇప్పటికే ఆయన వద్దకు చేరింది. ఘటన అనంతర పరిణామాలపై అధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన తిరుపతి బయల్దేరారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

News January 9, 2025

రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార ప్రొటోకాల్ దర్శనాలు రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి.

News January 9, 2025

తొక్కిసలాట ఘటన.. రెండు కేసులు నమోదు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపెట్టెడ వద్ద తొక్కిసలాట ఘటనపై ఈస్ట్‌ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్‌వో, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసే క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మూడు చోట్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.

News January 9, 2025

ఢిల్లీ కాంగ్రెస్ ఫైర్.. పృథ్వీరాజ్ చవాన్ యూటర్న్!

image

కాంగ్రెస్ సీనియర్ నేత, MH EX CM పృథ్వీరాజ్ చవాన్‌పై ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ మండిపడింది. ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీపై అంత నమ్మకముంటే ఆ పార్టీ టికెట్‌ పైనే పోటీచేయాల్సిందని విమర్శించింది. ఢిల్లీలో AAP గెలుస్తుందంటూ ఆయన జోస్యం చెప్పడంతో ఫైర్ అయింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని, పొత్తు ఉండుంటే INDIA కూటమి గెలిచేదని చెప్పినట్టు <<15104187>>చవాన్<<>> వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌దే గెలుపని తాజాగా చెప్పారు.

News January 9, 2025

దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ!

image

టెస్టుల్లో ఫామ్ కోల్పోయిన కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ENGతో జరగనున్న టెస్టు సిరీస్‌కి సన్నద్ధం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోతే దేశవాళీలు ఆడి తమను తాము నిరూపించుకోవాల్సిందే అని కోచ్ గంభీర్ ఇటీవల చెప్పిన నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ENGతో 5టెస్టుల సిరీస్ Juneలో ప్రారంభం కానుంది.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట: మృతులకు రూ.25 లక్షల పరిహారం

image

తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

News January 9, 2025

కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు SC నో

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని తెలిపింది. అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారణ చేయాలని కోరగా కోర్టు అనుమతించలేదు. ఈ నెల 15న లిస్ట్ అయినందున అదే రోజు విచారిస్తామని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News January 9, 2025

జగన్ లండన్ టూర్‌కు కోర్టు అనుమతి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆయన యూకేలో పర్యటించేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన లండన్ పర్యటనకు అనుమతించాలని జగన్ కోర్టును కోరారు.