News June 17, 2024

జట్టు వైఫల్యానికి నాదే బాధ్యత: హసరంగ

image

T20WCలో జట్టు వైఫల్యానికి కారణాలు ఏమైనా తనదే పూర్తి బాధ్యత అని శ్రీలంక కెప్టెన్ హసరంగ తెలిపారు. పిచ్‌లపై నింద మోపబోనని స్పష్టం చేశారు. ఇతర జట్లూ ఇదే పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాయని గుర్తు చేశారు. గ్రౌండ్ పరిస్థితులకు తాము అడ్జస్ట్ కాలేకపోయామని చెప్పారు. గ్రూప్-Dలో సౌతాఫ్రికా, బంగ్లా చేతుల్లో లంక ఓడిపోగా, నేపాల్‌తో మ్యాచ్ రద్దయ్యింది. నెదర్లాండ్స్‌పై మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News June 17, 2024

గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి.. UPSCకి 50మంది దూరం!

image

మహారాష్ట్రలోని సమర్థ్‌నగర్‌లో ఉన్న స్వామి వివేకానంద కాలేజీలో UPSC ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ వడగావ్ కోహ్లటీలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. మ్యాప్స్‌పై ఆధారపడ్డ 50మందికి పైగా అభ్యర్థులు మొదట వడగావ్ కోహ్లటీకి వెళ్లారు. తప్పుడు సెంటర్‌‌కి వచ్చామని గ్రహించి సమర్థ్‌నగర్‌కి చేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేశారు. దీంతో వారంతా పరీక్షకు దూరమయ్యారు.

News June 17, 2024

ఏఐతో సాఫ్ట్‌వేర్ రంగం నష్టపోదు: బిల్‌‌గేట్స్

image

ఏఐతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నష్టపోతారనే వాదనను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తోసిపుచ్చారు. ఏఐ ఉన్నా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలన్నిటినీ ఏఐ భర్తీ చేసే అవకాశం ఉన్నా 20ఏళ్లలో అది సాధ్యం కాదన్నారు. ఏఐతో ఉత్పాదకత మెరుగైందని.. భారత్, USలోని అనేక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనమని తెలిపారు. జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

News June 17, 2024

EVMలు లేకపోతే బీజేపీకి 40 సీట్లూ వచ్చేవి కాదు: ఆదిత్య థాక్రే

image

EC అంటే ఎన్నికల కమిషన్‌ కాదని, ఈజ్లీ కాంప్రమైజ్డ్‌ అని శివసేన(UBT) నేత ఆదిత్య థాక్రే విమర్శించారు. EVMలు లేకపోతే BJPకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ముంబై నార్త్ వెస్ట్ స్థానం ఫలితంపై సుప్రీంకోర్టు ఆశ్రయిస్తామని ప్రకటించారు. 48 ఓట్లతో గెలిచిన రవీంద్ర MPగా ప్రమాణం చేయకుండా ఆపాలని కోరుతామన్నారు. కౌంటింగ్ సమయంలో MP బంధువు మొబైల్‌తో ఓపెన్ చేసి డేటా మార్చినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

News June 17, 2024

మణిపుర్‌ పరిస్థితులపై షా హై లెవెల్ మీటింగ్

image

మణిపుర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ చీఫ్ తపన్ డేకా తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏడాదిగా మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా 2023 మే 3న ఘర్షణలు మొదలైనప్పటి నుంచి 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

News June 17, 2024

‘పుష్ప-2’ మేకర్స్ మనసులో రెండు తేదీలు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి తప్పుకోవడంతో కొత్త విడుదల తేదీ కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఓవర్సీస్ బాక్సాఫీస్‌ని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తే USAలో వారం రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ చేస్తే భారత్‌లో క్రిస్మస్, న్యూఇయర్ హాలీడేస్‌ మూవీకి భారీగా కలెక్షన్లు తెచ్చిపెడతాయని అనుకుంటున్నారు.

News June 17, 2024

ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు?: తెలంగాణ కాంగ్రెస్

image

మోదీ ప్రభుత్వంలో ఘోర రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2014లో గోరఖ్దామ్ ఎక్స్‌ప్రెస్- 25 మంది, 2016లో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్- 150 మంది, 2017లో పురీ-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్ 23 మంది, 2022లో బికనీర్-గువాహటి ఎక్స్‌ప్రెస్ 9 మంది, 2023లో బాలాసోర్- 296 మంది, కంచన్‌జంగా రైలు ప్రమాదంలో 15 మంది చనిపోయారని పేర్కొంది. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరిని నిలదీసింది.

News June 17, 2024

వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

image

AP: మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

News June 17, 2024

‘నాన్‌ క్యాష్ పేమెంట్స్’కే మొగ్గు

image

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ వాడే భారతీయులు నాన్ క్యాష్ పేమెంట్స్‌కే మొగ్గు చూపుతున్నారు. క్యాష్(భౌతిక నగదు)కు బదులుగా UPI, డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్స్‌తో పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆరేళ్ల క్రితం 20.4%గా ఉన్న నాన్ క్యాష్ పేమెంట్స్ ఇప్పుడు ఏకంగా 58.1%కి చేరింది. ఈ పేమెంట్స్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో చైనా ముందుండగా, ఆ తర్వాత ఇండియా, ఇండోనేషియా ఉన్నట్లు 2023 నివేదికలు చెబుతున్నాయి.

News June 17, 2024

EVMల హ్యాకింగ్.. మస్క్‌కు అవకాశం ఇవ్వాలన్న పురందీశ్వరి

image

AP: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి స్పందించారు. ‘భారత ఎన్నికల సంఘం మస్క్‌ను భారత్‌కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలా మందికి అవకాశం ఇచ్చింది. అయినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు’ అని ట్వీట్ చేశారు.