News June 17, 2024

వర్షాలేవీ..? జులైపైనే భారం!

image

TG: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించడంతో తొలకరి వర్షాలు పలకరించాయి. కానీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదుకావడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర భారతంపై ప్రభావం చూపుతున్నాయని IMD పేర్కొంది. ఈనెల చివరినాటికి రాష్ట్రంవైపు మళ్లి జులైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

News June 17, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

TG: గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు రెండు నెలల పాటు వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 31 తేదీల్లో పరిశీలిస్తామని పేర్కొన్నారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తమకు కేటాయించిన షెడ్యూల్‌ను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోవచ్చు.

News June 17, 2024

నీట్ పేపర్ లీక్ కాలేదు.. రెండుచోట్ల అవకతవకలు: కేంద్రమంత్రి

image

AP: నీట్ పేపర్ లీకేజీ జరగలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. పరీక్ష పారదర్శకంగా జరిగిందని అన్నారు. రెండు పరీక్ష కేంద్రాల్లోనే అక్రమాలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు 1563 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News June 17, 2024

త్యాగానికి ప్రతీక బక్రీద్: సీఎంలు చంద్రబాబు, రేవంత్

image

బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ ఉద్దేశం. అన్ని గుణాల కంటే దానగుణమే ఉత్తమమన్నది పండుగ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు’ అని CBN ట్వీట్ చేశారు. ‘త్యాగానికి ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు’ అని రేవంత్ అన్నారు.

News June 17, 2024

ఫేక్‌మనీతో బ్లాక్‌మనీ చోరీకి భారీ స్కెచ్!

image

TG: ఫేక్‌మనీ తయారీ నేపథ్యంలో వచ్చిన ‘ఫార్జీ’ మూవీ తరహాలో HYD ఆదిభట్లలో ఓ ముఠా నకిలీ నోట్లతో భారీ చోరీకి స్కెచ్ వేసింది. ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో రూ.950కోట్ల బ్లాక్‌మనీ ఉందని అక్కడి వాచ్‌మన్ ముఠాకు చెప్పాడు. నగదు కొట్టేసి దాని స్థానంలో ఫేక్‌మనీ, తయారీకి ఉపయోగించే పౌడర్, లిక్విడ్‌‌ పెట్టి యజమానే కరెన్సీ తయారు చేస్తున్నట్లు ముఠా నమ్మించాలనుకుంది. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో ముఠా కటకటాలపాలైంది.

News June 17, 2024

పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత

image

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ దేశం అమెరికాకు అప్పగించింది. ఇవాళ అతణ్ని ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా అమెరికా గడ్డపై గురుపత్వంత్ హత్యకు నిఖిల్ మరొక భారత ఉద్యోగితో కలిసి ప్లాన్ వేశారని US ఆరోపిస్తోంది. ఈ కుట్రలో తమ పాత్ర ఏమీ లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.

News June 17, 2024

నేపాల్‌పై విజయం.. సూపర్-8కి బంగ్లా

image

టీ20 వరల్డ్ కప్‌‌లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరింది. తాజాగా నేపాల్‌పై గెలిచిన బంగ్లా గ్రూప్-డీ నుంచి సౌతాఫ్రికా తర్వాత క్వాలిఫై అయిన జట్టుగా నిలిచింది. దీంతో సూపర్-8లో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఈనెల 22న భారత్‌ను బంగ్లా ఎదుర్కోనుంది. 20న అఫ్గానిస్థాన్, 24న ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తలపడనుంది.

News June 17, 2024

టీడీపీలో చేరడం లేదు: YCP MLA

image

AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఆలూరు YCP MLA విరూపాక్షి ఖండించారు. ‘YCP టికెట్‌పై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. YSR ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి YCPలో చేరాను. జగన్ నన్ను MLAగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని కోరారు.

News June 17, 2024

అల్లర్ల గురించి పిల్లలకు ఎందుకు బోధించాలి?: NCERT డైరెక్టర్

image

పాఠ్యపుస్తకాలు కాషాయమయం అవుతున్నాయన్న ఆరోపణలను NCERT డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ కొట్టిపారేశారు. ‘గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేతల గురించి పిల్లలకు ఎందుకు బోధించాలి? పెద్దయ్యాక వారే తెలుసుకుంటారు’ అని అన్నారు. తాజాగా విడుదలైన పుస్తకాల్లో బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించలేదు. ‘మూడు గుమ్మటాల నిర్మాణం’ అని పేర్కొన్నారు. BJP రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో మత ఘర్షణలు తదితర అంశాలను తొలగించారు.

News June 17, 2024

ఈజీగా ప్రిలిమ్స్ పేపర్.. పెరగనున్న కటాఫ్!

image

యూపీఎస్సీ ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పేపర్ సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ స్టడీస్, సీశాట్ పేపర్లు రెండింటిలో తికమక పెట్టకుండా ప్రశ్నలు సూటిగానే ఇచ్చారని నిపుణులు అంటున్నారు. పేపర్ ఈజీగా ఉండటంతో ఈసారి కటాఫ్ పెరగొచ్చని(80-95) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది రెండు పేపర్లు టఫ్‌గా ఉండటంతో కటాఫ్ 75గా నిర్ణయించారు.