News June 17, 2024

రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్

image

T20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచారు. 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన 549 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ(529-భారత్), విలియమ్సన్(527-న్యూజిలాండ్), జయవర్దనె(360-శ్రీలంక), గ్రేమ్ స్మిత్(352-దక్షిణాఫ్రికా) ఉన్నారు.

News June 17, 2024

స్పీకర్‌గా అయ్యన్న పేరు ఖరారు?

image

AP: అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

News June 17, 2024

నేడు పోలవరం సందర్శనకు చంద్రబాబు

image

AP: నేడు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి, తిరిగి సా.4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిదే తొలి పర్యటన.

News June 17, 2024

యుద్ధాన్ని ఆపేందుకు ఇదే సరైన సమయం: బైడెన్

image

హమాస్‌కు ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ముస్లింలకు ఈద్-అల్-అధా శుభాకాంక్షలు తెలిపారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య మారణకాండలో అమాయకులు బలవుతున్నారని పేర్కొన్నారు. వారి బాధ వర్ణాణాతీతం అన్నారు. పీడిత ముస్లిం వర్గాల హక్కుల కోసం అమెరికా ఎల్లప్పుడూ తమ గొంతు వినిపిస్తుందని చెప్పారు.

News June 17, 2024

ఫైనల్లో ఓడిన సుమిత్ నగల్

image

భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ పెరుజియా ఛాలెంజ్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. ఇటలీ ప్లేయర్ లూసియానతో జరిగిన తుది పోరులో 6-1, 6-2 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. గంట వ్యవధిలోనే మ్యాచ్ పూర్తవ్వడం గమనార్హం. ఈ పరాజయంతో ఈ ఏడాది మూడో టైటిల్‌ వేటలో సుమిత్ విఫలమయ్యారు.

News June 17, 2024

అగ్నిపథ్ రీ-లాంచ్.. PIB FactCheck రిప్లై ఇదే

image

అగ్నిపథ్ పథకం రీ-లాంచ్ పేరుతో వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. పథకం మార్పునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. కాగా అగ్నిపథ్‌ పేరును ‘సైనిక్ సమాన్ స్కీమ్’గా మార్చడంతో పాటు డ్యూటీ పీరియడ్, పర్మినెంట్ శాతం, ఆదాయం పెంపు అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

News June 17, 2024

ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన విద్యార్థులు

image

బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్‌కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.

News June 17, 2024

రియల్ హీరో.. విశ్వక్‌సేన్‌పై ప్రశంసలు

image

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరణానంతరం అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మెట్రో రెట్రో’ పేరిట జరిగిన కార్యక్రమలో ఈ ప్రతిజ్ఞ చేశానని ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో విశ్వక్ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, జగపతి బాబు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.

News June 17, 2024

ఎన్నికల్లో గెలిస్తే వారిని దేశం నుంచి బహిష్కరిస్తా: ట్రంప్

image

తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశం ఇప్పుడున్నంత ప్రమాదంలో ఎప్పుడూ లేదని మిషిగాన్‌లో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? వారిని దేశం నుంచి పంపే అధ్యక్షుడు కావాలా? అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అతిపెద్ద బహిష్కరణ చేపడతానన్నారు.

News June 17, 2024

జూన్ 17: చరిత్రలో ఈరోజు

image

*1913: స్వాతంత్ర్య సమరయోధుడు తిరుమల రామచంద్ర జననం.
*1946: రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం మరణం.
*1973: భారత టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ జననం.
*1980: టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ జననం.