News January 9, 2025

బాలకృష్ణలో అలాంటి అహం లేదు: హీరోయిన్

image

ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నా బిగ్ స్టార్‌ని అనే అహం బాలకృష్ణలో లేదని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారని చెప్పారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరికీ గౌరవం ఇస్తారని పేర్కొన్నారు. ‘డాకు మహారాజ్’ సినిమాలో తన పాత్ర సాఫ్ట్‌గా ఉంటుందన్నారు. ఈ రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువవుతానని తెలిపారు. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ కానుంది.

News January 9, 2025

రాష్ట్రంలో ఇక KF బీర్లు దొరకవా?

image

TG: ప్రభుత్వం రేట్లు పెంచడం లేదంటూ యునైటెడ్ బ్రూవరీస్(UB) సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. KF సహా 7 రకాల బీర్లు తయారుచేసే ఈ సంస్థకు సంబంధించి ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. కొన్నిరోజుల పాటు KF బీర్లు వైన్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అప్పటిలోపు ప్రభుత్వం, UB కంపెనీ మధ్య సయోధ్య కుదిరితే KF బీర్ల సరఫరాకు ఆటంకం ఉండదు. లేదంటే ఇకపై రాష్ట్రంలో ఆ రకం బీర్లు లభించవు.

News January 9, 2025

Breaking: 1978 సంభల్ అల్లర్ల కేసు రీఓపెన్

image

1978 సంభల్ అల్లర్లపై UP Govt కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా మూసేసిన కేసును 47 ఏళ్ల తర్వాత తెరుస్తోంది. వారంలోపు దర్యాప్తును ముగించి రిపోర్టు ఇవ్వాలని SPని ఆదేశించింది. UP MLC శ్రీచంద్ర శర్మ డిమాండుతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అల్లర్లకు పాల్పడింది ఎవరు? రాజకీయ ఒత్తిళ్లతో పేర్లు వెల్లడించని వ్యక్తులు ఎవరు? స్వస్థలాన్ని వదిలేసి వెళ్లిన వారెందరో గుర్తించడమే రీఓపెన్ ఉద్దేశంగా తెలుస్తోంది.

News January 9, 2025

ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలి: వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన ఘోరమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకున్నాం. అధికారులతో టీటీడీ సరిగ్గా పనిచేయించలేదు. పోలీసులను కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News January 9, 2025

కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.

News January 9, 2025

ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం

image

TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.

News January 9, 2025

Stock Markets: ఫార్మా, ఫైనాన్స్ షేర్లు డౌన్

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందాయి. Q3 results నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608 (-83), సెన్సెక్స్ 77,902 (-245) వద్ద ట్రేడవుతున్నాయి. fmcg, media షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. bank, ఫైనాన్స్, ఫార్మా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. కొటక్, hul, bajaj auto, itc టాప్ గెయినర్స్.

News January 9, 2025

తిరుపతి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్

image

తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి పరిస్థితిపై స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ తాజాగా వివరాలు వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్‌లో ఉండాలని తెలిపారు. రుయా ఆస్పత్రిలో ఉన్నవారిని స్విమ్స్‌కు తరలించగా, మొత్తం 13మంది అక్కడ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఇక్కడికే వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

News January 9, 2025

ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్

image

TG: ఫార్ములా-e రేసు కేసులో KTR నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ లాయర్‌, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్‌ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. IAS దాన‌ కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు KTRను విచారించనున్నారు.

News January 9, 2025

ఆయుష్మాన్ భారత్‌కు నిరాకరణ.. క్యాన్సర్ పేషంట్ ఆత్మహత్య

image

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నిరాకరించిందని 72 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఈ పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వైద్యులు ఉచిత చికిత్సకు నిరాకరించారు. డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనా స్కీం అందలేదనే ఆవేదనతో అతను సూసైడ్ చేసుకున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు.